ఇప్పటి వరకు ఏ సినిమాకు అయినా ఒక పాట యాడ్ చేసిన సందర్భాలు వున్నాయి. ఫైట్ యాడ్ చేసారు. సీన్ యాడ్ చేసారు. అలా కాకుండా సినిమా మొత్తం మీద ఎక్కడ తీసిన సీన్ ను మళ్లీ అక్కడే కలపడం అన్నది ఏకంగా 20 నిమిషాలు కలపడం అన్నది ఇదే తొలిసారి అనుకోవాలి. పుష్ప 2 తొలి వెర్షన్ మూడు గంటల నలభై నిమిషాలు ఫైనల్ కాపీ వచ్చింది. అంత సినిమా చూడడం కష్టం అవుతుందేమో అని భయపడ్డారు. అందుకే 3 గంటల 20 నిమిషాల మేరకు కుదించి విడుదల చేసారు. అప్పటికే అంత నిడివి నా అనుకున్నారు. అయినా ధైర్యంగా విడుదల చేసారు. సినిమా పెద్ద హిట్ అయింది.
అయినా కూడా…అయినా కూడా..
తెలుగు నాట సీడెడ్ మినహా మిగిలిన ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. జిఎస్టీలు కలుపుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. నైజాంలో ఇప్పటికి 88 కోట్ల వరకు చేసింది. ఇంకా 12 కోట్లు వసూలు చేయాలి.
ఇది ఒక పాయింట్.
పుష్ప 2 ను చూసిన వారు చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి వుండనే వుంది. షెకావత్ క్యారెక్టర్ ను సరిగ్గా డిజైన్ చేయలేదని,ఓపెనింగ్ షాట్ కు లింక్ లేదని ఇలా చాలా వున్నాయి. వాటన్నింటికి కారణం 3.40 నిడివిని 3.20 చేయడమే.
అందుకే ఇప్పుడు మొత్తం ఫైనల్ కట్ ను థియేటర్ లో విడుదల చేస్తున్నారు. ఈ వెర్షన్ లో తొలివెర్షన్ లో మిస్ అయిన లాజిక్ లింక్ లు వుంటాయి. బలమైన హీరో ఎలివేషన్లు వుంటాయి. అన్నింటి కన్నా షెకావత్ పాత్ర పూర్తిగా వుంటుంది.
అయితే..ఒకటే సమస్య
మళ్లీ మరోసారి వచ్చి పుష్ప 2 ఎంత మంది చూస్తారు అన్నదే. అందుకే నైజాంలో టికెట్ రేట్లు బాగా అంటే బాగా తగ్గిస్తున్నారు. మినిమమ్ 120 రూపాయలకే సింగిల్ స్క్రీన్ లో సినిమా చూపిస్తారు. చూడాలి మరి ఎలా వుంటుందో ఇదంతా కలిసి..పుష్ప 2 రివైజ్డ్ వెర్షన్.
Oka sari chudatame kastam malli 2nd time
Nenu 3 times chusa. Third time konchem boring ga anipinchindi
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
ప్లే బాయ్ వర్క్ ‘- ఏడు,
తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
Endi ra veedi racha. Pichakuntla cinema ki intha dobbutunnaru
ఎవరి ఆనందం వాళ్ళది .. ఆస్కార్ కి ట్రై చేస్తే సరి . .