అసలే 2022 సంక్రాంతి సినిమాల తొక్కిసలాట మామూలుగా లేదు. ఇప్పటికే మహేష్, పవన్, ప్రభాస్ ల సినిమాల డేట్ లు అధికారికంగా ప్రకటించారు.
అధికారికంగా ప్రకటించకపోయినా, ఎలాగైనా జనవరి 12నే తన ఆచార్య సినిమాను కూడా విడుదల చేయాలని దర్శకుడు కొరటాల శివ పట్టుదలగా వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
కొరటాల ఇంత పట్టుదలగా వుండడానికి కారణాలు ఏమై వుంటాయని ఎవరికి వారు ఊహాగానాలు చేస్తున్నారు. దిల్ రాజుతో కిట్టని వ్యవహారం నుంచి చాలా చాలా కథలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో నాగ్ -చైతన్య-కీర్తిశెట్టి కాంబినేషన్ లో కళ్యాణ్ కృష్ణ తయారుచేస్తున్న బంగార్రాజు కూడా విధిగా సంక్రాంతి బరిలోకి దిగుతుందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ మేరకు జీ టీవీ తో కుదుర్చుకున్న ఒప్పందంలోనే క్లారిటీగా క్లాజ్ వుందని తెలుస్తోంది.
47 కోట్లకు ఫస్ట్ కాపీ తీసి అందించే విదంగా నాగ్ ఒప్పందం కుదర్చుకున్నారు. సినిమా పంపిణీ బాధ్యత కూడా నాగ్ దే. అది కూడా 2022 సంక్రాంతికే చేయాల్సి వుంటుంది. మరి ఈ లెక్కన ఎవరికి ఎన్ని థియేటర్లు దొరుకతాయో చూడాల్సి వుంది.