సంక్రాంతి రేస్ లోకి ‘హనుమాన్’

దర్శకుడు ప్రశాంత్ వర్మ నుంచి వస్తున్న సినిమా. చాలా మంది సినిమా అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా. కచ్చితంగా సమ్ థింగ్ వుంటుంది అనుకుంటున్న సినిమా. అదే ‘హనుమాన్’. Advertisement ఈ సినిమా విడుదల…

దర్శకుడు ప్రశాంత్ వర్మ నుంచి వస్తున్న సినిమా. చాలా మంది సినిమా అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా. కచ్చితంగా సమ్ థింగ్ వుంటుంది అనుకుంటున్న సినిమా. అదే ‘హనుమాన్’.

ఈ సినిమా విడుదల చాలా కాలంగా ఇదిగో అదిగో అంటూ వినిపిస్తోంది. సినిమా ఎక్కువగా సిజి వర్క్ మీద ఆధారపడడం వల్ల అస్సలు తొందరపడడం లేదు. ఆగస్టు అనుకున్నారు. కాదు డిసెంబర్ అనుకున్నారు. కానీ ఇప్పుడు జనవరి అదే సంక్రాంతికి అంటూ ప్రకటించబోతున్నారు. ఈ సినిమాలో తేజు సజ్జా హీరో.

నిజానికి ఇది కాస్త ఆశ్చర్యమే. దాదాపు రెడీ అయిపోతున్న సినిమాను అన్ని నెలలు హోల్డ్ చేసి పెట్టడం అన్నది ఒక పాయింట్. హేమా హేమీ సినిమాలు పోటీ పడతాయి అని అనుకుంటున్న 2024 సంక్రాంతి రేస్ లోకి హనుమాన్ దిగడం అన్నది మరో పాయింట్.

ఇప్పటికే సంక్రాంతి 2024 బరిలోకి ప్రభాస్ ప్రాజెక్ట్ కే, మహేష్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగిల్ రావడానికి సిద్దంగా వున్నాయి. ప్రాజెక్ట్ కె రాదన్న ధీమాతో హనుమాన్ వస్తోందనుకోవాలి. కానీ ప్రాజెక్ట్ కే పక్కాగా వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

కిందా మీదా పడయినా మహేష్ సినిమాను సంక్రాంతి బరిలోకి తీసుకురావాల్సిందే. అది దాటితే ఆ సినిమాకు చాలా కష్టం అవుతుంది. ఇటు కాస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. రెండవది ఆ సీజన్ కాకుంటే మార్కెట్ ఎఫెక్ట్ అవుతుంది.

మరి ఈ ఫ్యాక్టర్లు అన్నీ తెలిసి కూడా హనుమాన్ సంక్రాంతి బరిలోకి దిగాలని ఎందుకు అనుకుంటున్నట్లు? అంటే ఏ సినిమాలు వస్తాయో, రావో అన్న ఇన్ సైడ్ ఇన్ ఫో హనుమాన్ మేకర్లకు తెలిసి వుండాలి.