తెలుగుదేశం జనసేనతో పొత్తు కాదు కానీ త్యాగాలకు పూర్తిగా సిద్ధం కావాల్సి వస్తోందని అంటున్నారు. పొత్తు అంటే జనసేనకు ఇవ్వాల్సిన సీట్లు ఇచ్చేయాల్సిందే. విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గం సీటుని జనసేన కోరుతోంది అన్న ప్రచారం అయితే ఉంది.
ఈ సీటు టీడీపీకి చాలా ఇంపార్టెంట్. 1983 నుంచి 2004 వరకూ వరసగా గెలుచుకుని వచ్చిన సీటు. అయితే గడచిన రెండు దశాబ్దాలలో 2014లో మాత్రమే టీడీపీ గెలిచింది. ఓడినా కూడా లక్ష ఓట్లకు తగ్గకుండా 2019లో టీడీపీ సాధించింది. టీడీపీకి బాగా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న సీటు ఇది.
అలాంటి సీటుని ఇపుడు జనసేన కోరుతోందని టాక్. ఈ సీటు నుంచి 2019లో జనసేన తరఫున పోటీ చేసి పాతిక వేలు ఓట్లు తెచ్చుకున్న పంచకర్ల సందీప్ పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆయన రాజకీయాలకు కొత్త జనసేన కొత్త అయినా సరే పాతిక వేల ఓట్లను ఆనాడే తెచ్చారు. ఈసారి అంతకంటే ఎక్కువ ఓట్లతో విజయం ఖాయమని జనసేన భావిస్తోంది.
పొత్తులు కనుక ఉంటే బంపర్ మెజారిటీ ఖాయమని కూడా లెక్క వేసుకుంటోంది. ఇక్కడ నుంచి టీడీపీ నుంచి చాలా మంది పోటీకి రెడీ అవుతున్నా జనసేన సీటు కోరితే ఇచ్చేయడం ఖాయమని అంటున్నారు. భీమిలీ నుంచే టీడీపీ త్యాగరాజులు బయల్దేరుతారు అని అంటున్నారు.