తగ్గేదేలే…చూసుకుందాం..సంక్రాంతికి

తగ్గదేలే…అన్నది మెగా క్యాంప్ హీరో బన్నీ నినాదం… Advertisement చూసుకుందాం మీ ప్రతాపమో..నా ప్రతాపమో అన్నది నందమూరి బాలయ్య డైలాగు. ఇప్పుడు సంక్రాంతి పోటీ అనగానే ఈ డైలాగులే వినిపిస్తున్నాయి. సంక్రాంతికి తన సినిమా…

తగ్గదేలే…అన్నది మెగా క్యాంప్ హీరో బన్నీ నినాదం…

చూసుకుందాం మీ ప్రతాపమో..నా ప్రతాపమో అన్నది నందమూరి బాలయ్య డైలాగు.

ఇప్పుడు సంక్రాంతి పోటీ అనగానే ఈ డైలాగులే వినిపిస్తున్నాయి. సంక్రాంతికి తన సినిమా రావాలన్నది మెగాస్టార్ కోరిక. తను చేస్తున్న వాల్తేర్ వీరయ్య సినిమాను సంక్రాంతికి అంటూ ముందే ప్రకటించేసారు. బాలయ్య సినిమా వున్నా కూడా దానిని డిసెంబర్ మూడోవారంలో అఖండ డేట్ కు వేసుకోవచ్చు అని నిర్మాతలు లైట్ తీసుకున్నారు. సంక్రాంతికి మెగాస్టార్ సినిమాకు థియేటర్లు కూడా బుక్ చేయించేసారు. కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగింది.

బాలయ్య కూడా తన సినిమాను సంక్రాంతికే వేసి తీరాలంటున్నారు. వేరే నిర్మాత అయితే సమస్య లేకపోను.రెండు సినిమాలు కూడా మైత్రీ మూవీ మేకర్స్ వే. పోనీ ఇద్దరి సినిమాలు వేస్తే పోలా? అంటే చాలా కష్టం అయిపోతుంది.

ఎందుకంటే బాలయ్య ఫుల్ ఫామ్ లో వున్నారు. పైగా ఆ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని హిట్ మీద వున్నారు. కానీ మెగాస్టార్ ఆ రేంజ్ ఫామ్ లో లేరు. పైగా ఆ సినిమా దర్శకుడు వెంకీ మామ లాంటి యావరేజ్ సినిమా ఇచ్చి వున్నారు. అదీ కాక మెగా క్యాంప్..నందమూరి క్యాంప్ ఫైట్ సోషల్ మీడియాలో మామూలుగా వుండదు.  ఇప్పటికే ‘చూసుకుందాం..రండి..సంక్రాంతికి’ అని ఇరు వైపుల నుంచి కవ్వింపులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో ఎవరు వెనక్కు తగ్గినా ఫ్యాన్స్ కు కష్టమే. బాలయ్య భయపడ్డారు. లేదా మెగాస్టార్ భయపడ్డారు అని మోసేస్తారు. టాలీవుడ్ చరిత్రలో ఒకే బ్యానర్ నిర్మించిన రెండు భారీ సినిమాలు ఒకేసారి విడుదలైన రికార్డు లేదు. మైత్రీ నిర్మించిన ఈ రెండు సినిమాలు సంక్రాంతికి వస్తే అది రికార్డే అవుతుంది.

కానీ ఒకటే సమస్య రెండూ హిట్ అయితే ఓకె. లేదూ ఏ ఒక్కటి కాస్త తగ్గినా వ్యవహారం చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. కానీ బాలయ్య మాత్రం అస్సలు తగ్గడం లేదని, అవసరం అయితే సినిమాను తాను కొనేసి మరీ విడుదల చేస్తారని ఫ్యాన్స్ వర్గాల నుంచి వినిపిస్తోంది. మెగాస్టార్ మాత్రం ‘వేరే వైపు నుంచి’ వ్యవహారాన్ని నరుక్కువస్తారని, ఆ విధంగా వ్యవహారాన్ని సానుకూలం చేసుకుంటారని టాక్ వినిపిస్తోంది. ఆ వేరే వైపు నుంచి నరుక్కు రావడం ఏమిటో తెలియాల్సి వుంది.