సంక్రాంతి సకుటుంబ వినోద చిత్రం

సంక్రాంతి పండగ ట్రేడ్ మార్క్ సినిమాలు కొన్ని వుంటాయి. వాటికి కొన్ని పడికట్టు లెక్కలు వుంటాయి. ఈ లెక్కలు..కూడికలు..తీసివేతలు అన్నీ చూసుకుని చేసిన సినిమాలా కనిపిస్తోంది తమిళ హీరో విజయ్ వారసుడు. ఈ సినిమా…

సంక్రాంతి పండగ ట్రేడ్ మార్క్ సినిమాలు కొన్ని వుంటాయి. వాటికి కొన్ని పడికట్టు లెక్కలు వుంటాయి. ఈ లెక్కలు..కూడికలు..తీసివేతలు అన్నీ చూసుకుని చేసిన సినిమాలా కనిపిస్తోంది తమిళ హీరో విజయ్ వారసుడు. ఈ సినిమా తమిళ వెర్షన్ వారిస్ ట్రయిలర్ విడుదలయింంది. అదే ట్రయిలర్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా. 

ట్రయిలర్ చూస్తుంటే కొత్తగా ఏమీ లేదు. ఒక కుటుంబం. తల్లి..తండ్రి..ఇద్దరు కొడుకులు..ఇంటికి దూరంగా వుండే ఇంకో కొడుకు..అతగాడే హీరో. వీళ్లను ఇబ్బంది పెట్టే విలన్. ఆ విలన్ పని పట్టిన హీరో. అదీ కథ. అని అర్థం అయిపోతోంది. అజ్ఙాతవాసి నుంచి అలవైకుంఠపురములో వరకు అనేక సార్లు చూసిన లైన్ నే.

అయితే వంశీ పైడిపల్లి ఇది తన మార్కులో ఎలా చూపించారన్నది పాయింట్. ప్రకాష్ రాజ్, జయసుధ, శరత్ కుమార్, శ్రీకాంత్ ఇలా మనకు తెలిసిన వాళ్లందరినీ తెలిసిన కథలో చూస్తుంటే కొత్తగా అనిపించలేదు. కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమిటంటే విజయ్-రష్మిక. కలర్ ఫుల్ గా సాగిన చిత్రీకరణ, సాంగ్స్. విజువల్స్. అవన్నీ కలిసి తెలుసున్న ట్రయిలర్ ను చూడాలనిపించేలా చేసాయి.

విజయ్ మ్యానరిజమ్స్, రష్మిక అల్లరి, రంజితమే సాంగ్, ఫ్యామిలీ ఎమోషన్లు, మధ్యలో కాస్త సటిల్డ్ ఫన్ కలిసి సినిమాను సంక్రాంతి సకుటుంబ వినోద చిత్రం అన్నట్లు తయారు చేసినట్లు కనిపిస్తోంది. తమిళ నాట ఈ సినిమాదే పై చేయి కావచ్చు. ఎందుకుంటే అజిత్ సినిమా తెగింపు ట్రయిలర్ తో పోల్చుకుంటే వారసుడు ట్రయిలర్ కు రంగు..రుచి..వాసన..చిక్కదనం అన్నీ వున్నాయి.