శర్వానంద్ కు పెళ్లి కుదిరింది

టాలీవుడ్ లో చాలా మంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ వున్నారు. వాళ్లలో శర్వానంద్ ఒకరు. ఎప్పుడు పెళ్లి ఊసు ఎత్తినా ప్రభాస్ పెళ్లి తరువాత అంటూ దాటవేస్తూ వస్తున్నారు.  Advertisement ఇన్నాళ్లకు పెళ్లి ఘడిగయలు…

టాలీవుడ్ లో చాలా మంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ వున్నారు. వాళ్లలో శర్వానంద్ ఒకరు. ఎప్పుడు పెళ్లి ఊసు ఎత్తినా ప్రభాస్ పెళ్లి తరువాత అంటూ దాటవేస్తూ వస్తున్నారు. 

ఇన్నాళ్లకు పెళ్లి ఘడిగయలు వచ్చాయి. పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగబోతోందని తెలుస్తోంది. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న అమ్మాయిని శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఈ అమ్మాయి ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా హైదరాబాద్ లోనే వుంటున్నారు.

38 ఏళ్ల శర్వానంద్ దాదాపు పదేళ్లుగా సినిమా రంగంలో వున్నారు. మంచి స్థితిమంతుల కుటుంబానికి చెందిన శర్వానంద్ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. యువ నటుల్లో మంచి నటన కనబర్చే నటుడిగా పేరు వుంది. ఇటీవలే ఒకే ఒక జీవితం తో మంచి హిట్ కొట్టాడు. పీపుల్స్ మీడియా, సితార బ్యానర్లలో రెండు సినిమాలు చేస్తున్నాడు.

అమ్మాయి పేరేంటీ, మిగిలిన వివరాలు త్వరలో .