ఆయన ఓ హీరో. పెద్ద హీరో. ఎటొచ్చీ కాస్త హార్మోన్లూ..భావేవేశం ఎక్కువ. అందువల్లే కావచ్చు. అమ్మాయిలు స్నేహాలు అంటే ఇష్టం అని, కానీ అన్నీ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయని టాక్. నవ్విపోదురు గాక నాకేటి అనే టైపు.
అయితే ఎప్పటి నుంచో ఫలానా..పలానా అని పేర్లు అయితే వినిపిస్తూ వుంటాయి. కానీ ఎక్కడా గ్యాసిప్ లే తప్ప, అంతకు మించి ఏమీ కనిపించదు. అంతా చాలా గుట్టు చప్పుడు లేకుండా సాగుతుందని టాక్. ఇలాంటి వ్యవహారాల వల్లే ఎప్పడో ఓసారి విదేశంలో పోలీసుల వల్ల ఇబ్బంది కూడా పడ్డారని అంటారు. ఎంతవరకు నిజమో మరి.
ఇంతకీ విషయం ఏమిటంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఓ అమ్మాయి దగ్గరయిందని టాక్ వినిపిస్తోంది. ఆ అమ్మాయి ఓ మాజీ ప్రజా ప్రతినిధి బంధువు అని తెలుస్తోంది. ఏ కారణంతో ఈయన దగ్గరకు వచ్చారో కానీ అలా అలా ఇద్దరి మధ్య బంధం పెరిగిందని గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య అధికార కార్యక్రమాల బంధమా? లేక అంతకు మించా అన్నది తెలియదు కానీ గ్యాసిప్ కాస్త క్లోజ్డ్ సర్కిళ్లలో వినిపించడం ప్రారంభమైంది మరి.
మరింత పొగ వస్తే, అప్పుడు నిప్పు కనిపించే అవకాశం వుంది.