సరిలేరు నీకెవ్వరూ…మెలోడియస్ యాంథమ్

సాధారణంగా సైనిక గీతం అంటే, వేలాది మంది కవాతు చేస్తే వచ్చే బూట్ల శబ్ధంలా వుంటుంది. ఉత్తేజగీతంలా వుంటుంది. కానీ మ్యూజిక్ డైరక్టర్ కొత్త ప్రయోగం చేసారు. మాంచి మెలోడియస్ ఎత్తుగడతో ట్యూన్ తీసుకుని,…

సాధారణంగా సైనిక గీతం అంటే, వేలాది మంది కవాతు చేస్తే వచ్చే బూట్ల శబ్ధంలా వుంటుంది. ఉత్తేజగీతంలా వుంటుంది. కానీ మ్యూజిక్ డైరక్టర్ కొత్త ప్రయోగం చేసారు. మాంచి మెలోడియస్ ఎత్తుగడతో ట్యూన్ తీసుకుని, దానికి ఎమోషనల్ టర్నింగ్ ఇచ్చారు. పాటకు క్యాచీ ట్యూన్ వుండాలని కాకుండా, మాంచి ఇనుస్ట్రుమెంటేషన్ వుండాలనుకున్నారు. ఆ దిశగానే పాటను తయారుచేసినట్లు కనిపిస్తోంది.

ఈ గీతాన్ని దేవీశ్రీ ప్రసాద్ నే స్వయంగా రచించారు. శంకర్ మహదేవన్ పాడారు. 'భగభగమండే నిప్పులవర్షమొచ్చే నిప్పుల వర్షమొచ్చినా, జనగణమణ అంటూ దూకేవాడే సైనికుడు' అంటూ ప్రారంభమైన ఈ గీతం మెలోడీ టచ్ తో మెల్లగా ప్రారంభమై, పీక్ కు వెళ్తుంది. ఆ తరువాత 'సరిలేరు నీకెవ్వరూ..నువ్వు వెళ్లే నీ రహదారికి జోహారు' అనే మెయిన్ ట్యూన్ వస్తుంది.

విదేశాల్లో రికార్డ్ చేసిన ఈ సాంగ్ కు వాడిన ఇనుస్ట్రుమెంటేషన్ బాగుంది. ట్యూన్ క్యాచీ కాకున్నా, మధ్యలో గతంలో ఎక్కడో విన్న పాటల ట్యూన్ లు టచ్ చేసినా, టోటల్ గా బాగానే వున్న ఫీల్ ను మిగులుస్తుంది.

అనిల్ రావిపూడి డైరక్షన్ లో మహేష్-రష్మిక జంటగా నటించిన ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలవుతుంది.