కాజ‌ల్ బికినీ ట్రీట్.. కార‌ణ‌మ‌దేనా!

త‌గ్గుముఖం ప‌డుతున్న అవ‌కాశాలు.. ఇదే కాజ‌ల్ అగ‌ర్వాల్ బికినీ ట్రీట్ వెనుక కార‌ణంగా తెలుస్తోంది. అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌డుతున్న వేళ హాట్ హాట్ గా అగుపించి కాజ‌ల్ అగ‌ర్వాల్ కొత్త అవ‌కాశాల‌ను పొందే ప్ర‌య‌త్నం…

త‌గ్గుముఖం ప‌డుతున్న అవ‌కాశాలు.. ఇదే కాజ‌ల్ అగ‌ర్వాల్ బికినీ ట్రీట్ వెనుక కార‌ణంగా తెలుస్తోంది. అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌డుతున్న వేళ హాట్ హాట్ గా అగుపించి కాజ‌ల్ అగ‌ర్వాల్ కొత్త అవ‌కాశాల‌ను పొందే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుగా ఉంది. ఇప్ప‌టికే పుష్క‌ర కాలానికి పై నుంచినే హీరోయిన్ గా కెరీర్ కొన‌సాగిస్తూ ఉంది ఈ భామ‌.

మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న కాజ‌ల్ ఒక ద‌శ‌లో టాప్ హీరోయిన్ స్టేట‌స్ ను ఎంజాయ్ చేసింది. చేతినిండా అవ‌కాశాల‌తో బిజీబిజీ గా గ‌డిపింది. చెల్లెలుకు కూడా పెళ్లి చేసేసి, త‌ను మాత్రం కెరీర్ కే అంకితం అయిపోయింది. అయితే వ‌య‌సు మీద ప‌డ‌టంతో స‌హ‌జంగానే అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌ట్టాయి. వ‌య‌సు మీద ప‌డిన హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు వ‌స్తూ ఉన్నాయి. 

త‌న‌లో కూడా వ‌య‌సు పెరుగుతున్నా గ్లామ‌ర్ డోస్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు అని నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుగా ఉంది కాజ‌ల్. అందుకే మాల్దీవుల నుంచి హాట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ ఉంది.

పాత్ర డిమాండ్ చేస్తే.. బికినీ ధ‌రించ‌డానికి సిద్ధం అంటూ కొంత‌మంది హీరోయిన్లు స్టేట్ మెంట్ ఇస్తూ ఉంటారు. ఇప్ప‌టి వ‌ర‌కూ తెర మీద ఇంత పొట్టి డ్ర‌స్ లో క‌నిపించ‌ని కాజ‌ల్.. అలాంటి రొటీన్ స్టేట్ మెంట్ ఇవ్వ‌కుండా, ఈ హాట్ పిక్స్ ను పోస్ట్ చేసి, త‌ను చెప్పాల‌నుకున్న‌ది చెప్పేసిన‌ట్టుగా ఉంది!