పండగ..తొలి వీకెండ్ ఓకె

మారుతి-సాయితేజ్ కాంబినేషన్ లో తయారైన ప్రతి రోజూ పండగే సినిమా విడుదలైంది. సగటుసమీక్షలు వచ్చాయి. కానీ మౌత్ టాక్ బాగానే స్ప్రెడ్ అయింది. అది చాలా హెల్ప్ చేసింది.తొలి వీకెండ్ మూడు రోజులు కలిపి…

మారుతి-సాయితేజ్ కాంబినేషన్ లో తయారైన ప్రతి రోజూ పండగే సినిమా విడుదలైంది. సగటుసమీక్షలు వచ్చాయి. కానీ మౌత్ టాక్ బాగానే స్ప్రెడ్ అయింది. అది చాలా హెల్ప్ చేసింది.తొలి వీకెండ్ మూడు రోజులు కలిపి తెలుగు రాష్ట్రాల్లో కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి.

అయితే ఇది సరిపోతుందా, సరిపోదా అన్న సంగతి అలా వుంచితే, దర్శకుడు మారుతి స్టామినాకు కొంచెం తక్కువే. నాని, శర్వానంద్ ల కాంబినేషన్ తో వున్న క్రేజ్ సాయి తేజ్ తో వచ్చినట్లు కనిపించడం లేదు. ఎందుకంటే సినిమాకు వచ్చిన మౌత్ టాక్ బాగుంది. అందువల్లే మండే మార్నింగ్ షో లు, మాట్నీలు కూడా ఫరవాలేదు, మరీ డ్రాప్ కాలేదు అన్నట్లు వున్నాయి. కానీ తొలి మూడు రోజులు వెస్ట్, సీడెడ్ లాంటి ప్రాంతాల్లో గట్టిగా ఫేర్ చేయలేదు.

రూలర్ సినిమా ఎలా వున్నా, ఈ సినిమా వసూళ్లకు మాత్రం చాలా చోట్ల కొంత కన్నం పెట్టినట్లు కనిపిస్తోంది. అలాగే కాంబినేషన్ క్రేజ్ కూడా అంత వర్కవుట్ అయినట్లు లేదు. కేవలం మారుతి పేరు మీదే బండి నడిచిందా? అన్నది చిన్న అనుమానం. ఓవర్ సీస్ లో మహానుభావుడు, భలే భలే మగాడివోయ్ సినిమాలు మంచి వసూళ్లు నమోదు చేసాయి. వాటితో పోల్చుకుంటే ఈ సినిమాకు బాగా తక్కువే. ప్రస్తుతం మరో 300కే డాలర్లు చేస్తే తప్ప ఓవర్ సీస్ లో గట్టెక్కదు.  

ఈ విషయం ఎలా వున్నా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తొలివీకెండ్ వచ్చిన ఫలితాలు ఆశాజనకంగా వున్నాయి. క్రిస్మస్ హాలీవుడేస్, న్యూ ఇయర్ వుండడంతో రన్ బాగుంటుందని అంచనా వేస్తున్నారు.

మూడు రోజుల షేర్

Nizam: 3.80 Cr.
Ceded: 1.10 Cr.
Vizag: 1.33 Cr.
Nellore: 0.34 Cr.
Krishna: 0.63 Cr.
Guntur: 0.66 Cr.
West: 0.52 Cr.
East: 0.68 Cr.