సర్కారు సమ్మర్ కు జంప్

ఆర్ఆర్ఆర్ తొలి దెబ్బ పడింది. ఎన్టీఆర్-చరణ్ ల కాంబినేషన్ సినిమా వస్తోందని తెలిసి, ఏనాడో డేట్ ఇచ్చిన మహేష్ సర్కారు వారి పాట సినిమా సమ్మర్ కు లాంగ్ జంప్ చేసింది. ఉగాది ముందు రోజు…

ఆర్ఆర్ఆర్ తొలి దెబ్బ పడింది. ఎన్టీఆర్-చరణ్ ల కాంబినేషన్ సినిమా వస్తోందని తెలిసి, ఏనాడో డేట్ ఇచ్చిన మహేష్ సర్కారు వారి పాట సినిమా సమ్మర్ కు లాంగ్ జంప్ చేసింది. ఉగాది ముందు రోజు అయిన ఏప్రిల్ 1 రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసారు. 

ముందుగా ఏప్రిల్ 28 అన్న వార్తలు వినిపించాయి కానీ ఆఖరికి ఏప్రిల్ 1నే డేట్ గా ఫిక్స్ అయ్యారు. మహేష్-కీర్తి సురేష్ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ నిర్మించే ఈ సినిమాకు పరుశురామ్ దర్శకుడు. గీతగోవిందం తరువాత అందిస్తున్న సినిమా ఇదే.

కరోనా రెండోఫేజ్ టైమ్ లోనే జనవరి విడుదల అని ప్రకటించారు. కానీ ఇటీవల ఆర్ఆర్ఆర్ డేట్ వచ్చిన దగ్గర నుంచి సర్కారువారి పాట వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తూనే వున్నాయి. ఆఖరికి అవే నిజమయ్యాయి.

ఈ సినిమా ఇటీవలే స్పెయిన్ షెడ్యూలు పూర్తి చేసుకుని వచ్చింది. ఈ నెల ఆరు నుంచి హైదరాబాద్ లో షూట్ ను కొనసాగిస్తారు.