నిన్నటికి నిన్న బద్వేల్ ఉప ఎన్నికల్లో ఢీ అంటే ఢీ కొట్టి ఫలితాలు వచ్చిన తరువాత మాదే నైతిక విజయం అని జబ్బలు చరచుకుంటున్న బీజేపీ జగన్ వెనకాల పడడం ఏంటి అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. అయితే అది నిజమే. జగన్ సై అంటే ఆయన వెంట మేము అంటోంది బీజేపీ.
అవును. అది కూడా తాను క్రియేట్ చేసిన స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఇష్యూలో అన్న మాట. జగన్ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే తాము వస్తామని, ఆయన వెంట ఢిల్లీకి వెళ్తామని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అంటున్నారు. మరి కేంద్రంలోని బీజేపీ సర్కార్ కదా ప్రైవేటీకరణ చేస్తోంది.
ఏపీ బీజేపీ నేతలుగా మీరే ఢిల్లీకి వెళ్లి దానికొక పరిష్కారం కనుగొనవచ్చు కదా అంటే మాత్రం కమలనాధులు వేరేలా మాట్లాడుతున్నారు. జగన్ ప్రభుత్వం అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలట.
అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ ని టార్గెట్ చేశారు పవన్. ఇపుడు బీజేపీ కూడా జగనే ఈ విషయంలో కేంద్రంతో మాట్లాడి ఏదో ఒకటితేల్చాలని అంటోంది. అంటే ఇక్కడ రాజకీయం ఉందా, కార్మికుల సంక్షేమం ఉందా అంటే జనాలే అర్ధం చేసుకోవాలేమో.
మరో విషయం ఏంటి అంటే ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ఈ రోజుకీ బీజేపీ గట్టిగా మాట్లాడడం లేదు, ఉక్కు కార్మికుల ప్రయోజనాలు దెబ్బ తినకుండా చూస్తామనే మాత్రమే చెబుతోంది.
మొత్తానికి జగన్ భుజం మీద తుపాకీ పెట్టి స్టీల్ ప్లాంట్ పోరు చేయాలని ఏపీలోని బీజేపీ సహా విపక్షాలు అన్నీ డిసైడ్ అయ్యాయి. మరి వైసీపీ సర్కార్ దీని మీద ఎలా అడుగులు వేస్తుందో చూడాలి.