సర్కారువారిపాట కు పూజ

మహేష్-మైత్రీల సర్కారువారి పాటకు పూజాకార్యక్రమం జరిగింది. కూకట్ పల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమానికి నిర్మాతలు, మహేష్ భార్య నమ్రత, దర్శకుడు పరుశురామ్ తదితరులు హాజరయ్యారు. Advertisement ఈరోజు (21) ఉదయం మంచి…

మహేష్-మైత్రీల సర్కారువారి పాటకు పూజాకార్యక్రమం జరిగింది. కూకట్ పల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమానికి నిర్మాతలు, మహేష్ భార్య నమ్రత, దర్శకుడు పరుశురామ్ తదితరులు హాజరయ్యారు.

ఈరోజు (21) ఉదయం మంచి ముహుర్తం వుండడంతో ఈ పూజా కార్యక్రమం నిర్వహించారని తెలుస్తోంది. ఇదిలా వుంటే సర్కారువారి పాట షూటింగ్ షెడ్యూలును కాస్త మార్చిన సంగతి తెలిసిందే.

గతంలో ముందుగా అమెరికాలోనూ, తరువాత హైదరాబాద్ లోనూ షూట్ చేయాలనుకున్నారు. ఇప్పుడు దాన్ని అటు ఇటు మార్చారు. జనవరి 16 లేదా 19 నుంచి హైదరాబాద్ లో షూట్ ప్రారంభమవుతుంది.

మార్చి నుంచి అమెరికా షెడ్యూలు వుంటుంది. ప్రస్తుతానికి 2021 దసరా టార్గెట్ గా సినిమాను రెడీ చేయబోతున్నారు. బ్యాంకులు, రుణాలు, ఎగవేత వంటి పాయింట్లతో సర్కారువారిపాట సినిమా కథ తయారైందని వార్తలు వున్నాయి. గీతగోవిందం సినిమా తరువాత దర్శకుడు పరుశురామ్ చేస్తున్న సినిమా ఇదే.

నా బాయ్ ఫ్రెండ్ ఫ్రెండుకే కిస్ పెట్టాను