షాక్ కానక్కరలేదు. టాలీవుడ్ లో వినిపిస్తున్న వాస్తవమే. ఫ్లాపుల్లో వున్న శర్వానంద్ రెమ్యూనిరేషన్ ఇప్పుడు 10 కోట్లకు చేరిపోయింది.
లేటెస్ట్ గా చేసిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు మంచి బజ్ వుంది. మంచి మార్కెట్ అయింది. ముఖ్యంగా థియేటర్ రైట్స్ మంచి రేట్లకు వెళ్లాయి. ఇది ఎవరికయ్యా ఉపయోగపడిందీ అంటే శర్వాకే.
ఈ సినిమా తరువాత శర్వా రెండు సినిమాలు చేయబోతున్నాడు. ఒకటి యువి సంస్థకు, మరొకటి పీపుల్స్ మీడియాకు. గతంలో ఛల్ మోహన్ రంగా సినిమా తీసిన కృష్ణ చైతన్య డైరక్షన్ లో పీపుల్స్ మీడియా సినిమా నిర్మించబోతోంది.
ఆ సినిమాకు పది కోట్ల రెమ్యూనిరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. నాన్ థియేటర్ హక్కులు పెరగడం, పరిస్థితి బాగుండడంతో టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలు కూడా రేట్లు పెంచుకున్నారు.
సీనియర్..జూనియర్ బేధం లేదు. మిడ్ రేంజ్ మెగా హీరోలు కూడా ఎనిమిది కోట్ల వరకు తీసుకుంటున్నారని తెలుస్తోంది.