సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ కు ఓ మంచి పాత్ర దక్కింది. శాసనసభ అనే టైటిల్ తో తయారవుతున్న విలక్షణ చిత్రంలో ఆయన ఎమ్మెల్యేగా నటిస్తున్నారు. ఎమ్మెల్యే గా నటించడం పెద్ద విశేషం అని కాదు. ఆ పాత్ర సినిమాలో చాలా కీలకమైనది కావడం విశేషం.
ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా నటిస్తున్నారు. సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న పాన్‌ఇండియా చిత్రం ఇది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు.
రాజేంద్రప్రసాద్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆగస్టు 15 ఇండిపెండేన్స్ డే సందర్భంగా సోమవారం విడుదల చేసారు. ఈ సందర్భంగా నిర్మాతలు తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు మాట్లాడుతూ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది.
యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఎమ్మేల్యే నారాయణస్వామిగా నటిస్తున్నారు. విలువలు, నిజాయితీ కలిగిన జాతీయ నాయకుడుగా ఆయన పాత్ర ఎంతో అద్భుతంగా వుంటుంది. ఇప్పటి వరకు ఆయన కెరీర్‌లో పోషించనటువంటి విభిన్నమైన పాత్ర ఇది.
చిత్రంలో ఈ పాత్ర ఎంతో హైలైట్‌గా వుంటుంది. మా చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవిబసుర్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది అన్నారు.