Advertisement

Advertisement


Home > Movies - Movie News

విజయ్ కు సూటబుల్ పాత్ర

బిచ్చగాడు సినిమాతో తనకంటూ ఓ మాంచి మార్కెట్ ను తెచ్చుకున్నాడు తమిళ హీరో విజయ్ ఆంటోనీ. కానీ ఆ తరువాత ఆ స్థాయిని నిలబెట్టుకునే సినిమా అందించలేకపోయాడు. 

తన స్వంత బ్యానర్ మీద చాలా ప్రయోగాలు చేసాడు కానీ సరైన సినిమాను ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు లేటెస్ట్ గా మరో సినిమాతో వస్తున్నాడు. హత్య అనే పేరుతో తయారవుతున్న ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది. చూస్తుంటే ఈసారి విజయ్ ఆంటోనీ సరైన పాత్ర ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.

ఎందకుంటే విజయ్ ఆంటోనీ యంగ్ హీరో మెటీరియల్ కాదు. ఓ డిఫరెంట్ పర్సనాలిటీ, మిడిల్ ఏజ్ గ్రూప్ కు చెందినట్లు కనిపిస్తాడు. హత్య సినిమాలో విజయ్ ఆంటోనీ గెటప్, కొద్దిగా గ్రే హెయిర్ అన్నీ కలిసి ఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రకు పక్కాగా సరిపోయినట్లు కనిపించాడు. ట్రయిలర్ మరీ క్రిస్ప్ గా, ఆద్యంతం ఆసక్తి కరంగా కట్ చేయలేకపోయినా, చూడాలన్న చిన్న బజ్ ను క్రియేట్ చేయగలుగుతుంది. ముఖ్యంగా ఈ జానర్ సినిమాలు చూసే వారిని ట్రయిలర్ ఆకట్టుకుంటుంది.

విజయ్ ఆంటోనీ చాలా నెమ్మదిగా సెటిల్డ్ గా నటిస్తాడు. అలాంటి హీరోలకు అన్ని కథలు నప్పవు. ఇప్పుడు ఎన్నుకున్న పరిశోధన టైపు సబ్జెక్ట్ లు సరిపోతాయి. కానీ ఎటొచ్చీ స్క్రిప్ట్ పెర్ ఫెక్ట్ గా వుండాలి. అది కూడా వుంటే ఈ హత్య సినిమాతో విజయ్ ఆంటోనీ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడనే అనుకుందాం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?