ప్రభాస్ సినిమా వదులుకుంటున్న దానయ్య

ఆల్ ఇండియా హీరో ప్రభాస్ సినిమాను ఎవరైనా వదలుకుంటారా? కానీ నిర్మాత దానయ్య వదులుకుంటున్నారు. ప్రభాస్-మారుతి కాంబినేషన్ తో ప్రభాస్ సినిమా ప్లానింగ్ లో వుంది. దీని కోసం దానయ్య యాభై కోట్లు అడ్వాన్స్…

ఆల్ ఇండియా హీరో ప్రభాస్ సినిమాను ఎవరైనా వదలుకుంటారా? కానీ నిర్మాత దానయ్య వదులుకుంటున్నారు. ప్రభాస్-మారుతి కాంబినేషన్ తో ప్రభాస్ సినిమా ప్లానింగ్ లో వుంది. దీని కోసం దానయ్య యాభై కోట్లు అడ్వాన్స్ సింగిల్ పేమెంట్ ఇచ్చారని టాక్ వుంది. 

ఈ సినిమా కోసం నెలకో వారం రోజులు ఇవ్వాలని ప్రభాస్ అనుకున్నారని బోగట్టా. కానీ ప్రాజెక్ట్ కె షూటింగ్, ఆదిపురుష్ డబ్బింగ్ వ్యవహారాలు, సలార్ వ్యవహారాలు అన్నీ వుండడంతో మారుతి సినిమా వ్యవహారం అబేయన్స్ లో పడింది.

మరి దానయ్య ఇందుకోసం వెనుకంజ వేసారో? మరే కారణం వుందో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అయ్యారు. దీంతో మరో నిర్మాత కోసం వెదుకులాట మొదలైంది. 50 కోట్లు సింగిల్ పేమెంట్ ఇచ్చి, ప్రభాస్ టైమ్ కోసం ఎదురు చూసే నిర్మాత కావాలి. యువి సంస్థ మరో ఓటిటి సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. కానీ అది సక్సెస్ కాలేదో ఏమిటో కానీ ఓ బడా నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లింది.

ప్రభాస్ ఫలానా టైమ్ లో సినిమా చేస్తా అంటే తాను రెడీ అని, అలా కాకుండా ఎప్పుడు చేస్తారో తెలియకుండా రంగంలోకి దిగలేమని ఆ నిర్మాత చెప్పడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. దాంతో ఒక సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా పెద్ద హిట్ కొట్టిన ఆ సంస్థ త్వరలో ప్రభాస్ సినిమా అగ్రిమెంట్ చేయబోతోందని బోగట్టా.

నిర్మాత మాత్రమే మారుతున్నారు తప్ప దర్శకుడు మాత్రం కాదు. మారుతినే దర్శకుడిగా వుంటారు.