Advertisement

Advertisement


Home > Movies - Movie News

స్టాట్యూ ఆఫ్ రివెంజ్

స్టాట్యూ ఆఫ్ రివెంజ్

దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఏం చేసినా సమ్ థింగ్ స్పెషల్ గా, కొంచెం డిఫరెంట్ గా వుంటుంది. నాచురల్ స్టార్ నాని హీరోగా నానీస్ గ్యాంగ్ లీడర్ అని పేరు పెట్టినపుడే జనాలకు కాస్త ఆశ్చర్యం కలిగింది. నాని సినిమాకు ఈ టైటిల్ ఏమిటి? విక్రమ్ కుమార్ కు ఈ మాస్ టైటిల్ ఐడియా ఏమిటి? అని.

కానీ ఇప్పుడు ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. డవుట్ లు అన్నీ తీర్చేసారు. వివిధ వయస్సులో వున్న అయిదుగురు మహిళలు, వాళ్లకు లీడర్ గా నాని. అందరి చేతుల్లో బైనాక్యులర్స్. దేని కోసమో? ఎవరి కోసమో శోధిస్తున్నట్లు లుక్కులు ఇచ్చారు గ్యాంగ్ అంతా.

అందరినీ కలిపి ఓ స్టాట్యూ స్టోన్ మీద నిల్చున్న లుక్ ఇచ్చారు. నాని హెయిర్ స్టయిల్, బియర్డ్ లో పెద్దగా మార్పేమీలేదు. మిగిలిన నటుల ఫేస్ లకు అడ్డుగా బైనాక్యులర్స్ పెట్టడంతో, ఎవరు ఎవరు అన్నది కాస్త సస్సెన్స్ లో వుంచినట్లు కనిపిస్తోంది.

ఆగస్టు 30 విడుదల డేట్ అని ఈ లుక్ లోనే ప్రకటించేసి, విడుదల డేట్ ను కన్ ఫర్మ్ చేసారు.

ప్రత్యర్థులు ఏకమై సుధీర్ విజయాన్ని ఆపలేకపోయారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?