జ్యోతి లక్ష్మీ సినిమాతో అందరి చూపులు తన వైపు తిప్పుకున్నాడు హీరో సత్యదేవ్. సహజమైన నటన, బేస్ వాయిస్.. ఓ హీరోకి కావాల్సిన మినిమమ్ క్వాలిటీలు అతనిలో కనిపించాయి.
చకచకా సినిమాలు వరించాయి. కానీ ఆ మేరకు విజయాలు మాత్రం వరించడం లేదు. ఈ రోజు సత్యదేవ్ బర్త్ డే. ఈ సందర్భంగా అనేక సినిమాల ప్రకటనలు వచ్చాయి. కానీ సత్యదేవ్ కు సిన్సియర్ సలహా ఏమిటంటే కౌంట్ కాదు..క్వాలిటీ చూసుకోవాలి.
తన పాత్ర వరకు చూసుకుంటున్నట్లు కనిపిస్తోంది. వైవిధ్యంగా వుందని ఓకె. చేసేస్తున్నట్లు అనిపిస్తోంది. కానీ బాక్సాఫీస్ దగ్గర క్లిక్ కావడం లేదు. ఒకటి రెండు సినిమాల వరకు ఇలా ఫరవాలేదు. కానీ వరుసగా ఇలాగే వుంటే కష్టం అవుతుంది.
తెలుగు ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు వున్నా ఇంకా..ఇంకా కావాల్సిందే అన్న పరిస్థితి వుంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఏడాదికి ఒక్క కొత్త హీరో నిలదొక్కుకున్నా బాగుంటుంది.
సత్యదేవ్ హీరో అనిపించేసుకున్నారు. పాత్రలు అతన్ని ఎంచుకుని మరీ వస్తున్నాయి. కానీ సరైన కథ, కథనాలున్న సినిమాలు అతని దగ్గరకు రావడం లేదనిపిస్తుంది. కొత్త దర్శకులు కావడం కొంత ఇబ్బంది పెడుతోంది. ఇలా కంటిన్యూగా స్ట్రగుల్ పడడం అంటే సరైనది కాదు. ఒక్క హిట్ సరైనది పడితే సత్య కెరీర్ సెటిల్ అవుతుంది.
సత్య సమస్య ఏమిటంటే అన్ని తరహా కథలు అతనికి సెట్ కావు. లవ్, రొమాన్స్, కాస్త దూరమే. మెసేజ్, డైలాగ్ బేస్డ్ ఎక్కువగా చూసుకుంటున్నారు. అలా అని మాస్ సినిమాలు ఎత్తుకున్నా కష్టమే.
థ్రిల్లర్లు సెట్ అవుతాయి కానీ ఎందుకో ఆ దిశగా ట్రయ్ చేయడం లేదు…ఏమైనా సత్య కాస్త కేర్ ఫుల్ గా సబ్జెక్ట్ లు ఎంచుకోవడం మంచిది. కాస్త ఆలస్యమైనా, గ్యాప్ వచ్చినా. ఎందుకంటే అతన్ని నచ్చే వారు మెచ్చేవారు వేచి వుంటారు. అంతే తప్ప ఫ్లాప్ సినిమాల్లో చూడాలనుకోరు.