సత్యదేవ్ కొత్త సినిమా టైటిల్ ఇదేనా?

బాక్సాఫీస్ హిట్ లేకపోయినా నాన్-థియేట్రికల్ మార్కెట్ తో నెట్టుకొస్తున్నాడు హీరో సత్యదేవ్. మరీ ముఖ్యంగా చిరంజీవి, అక్షయ్ కుమార్ సినిమాల్లో నటించడం ఇతడికి ప్లస్ అయింది. దీంతో సత్యతో సినిమాలు చేసేందుకు చాలామంది ఇంట్రెస్ట్…

బాక్సాఫీస్ హిట్ లేకపోయినా నాన్-థియేట్రికల్ మార్కెట్ తో నెట్టుకొస్తున్నాడు హీరో సత్యదేవ్. మరీ ముఖ్యంగా చిరంజీవి, అక్షయ్ కుమార్ సినిమాల్లో నటించడం ఇతడికి ప్లస్ అయింది. దీంతో సత్యతో సినిమాలు చేసేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇతడు కూడా అంతే బిజీగా కాల్షీట్లు కేటాయిస్తున్నాడు.

ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సత్యదేవ్. డాలీ ధనుంజయ (పుష్ప ఫేమ్)తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది. ఈ మూవీకి జీబ్రా అనే టైటిల్ పెడుతున్నారట.

బ్యాంకు చోరీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జీబ్రాకు లింక్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే టైటిల్ మాత్రం దాదాపు ఫిక్స్ అని తెలుస్తోంది. విక్రమ్ సినిమా టైపులో ఉంటుందట ఈ మూవీ.

ఓవైపు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే, మరోవైపు ఫుల్ బాటిల్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు సత్యదేవ్. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. త్వరలోనే సాంగ్స్ విడుదల చేసి, సత్యదేవ్ తో ప్రచారం మొదలుపెట్టాలనుకుంటున్నారు.