ఆమె గర్భవతి అయిందంటూ కొన్ని నెలలుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వాటిపై ఇటు సాయేషా, అటు ఆర్య ఎప్పుడూ స్పందించలేదు. ఆ పుకార్లు అలా కొనసాగుతూనే ఉన్నాయి. అంతలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది సాయేషా. నిన్న సాయేషాకు పాప పుట్టింది. ఈ విషయాన్ని హీరో విశాల్ స్వయంగా ప్రకటించాడు.
ఈ విషయాన్ని బ్రేక్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని, తను అంకుల్ అయ్యానని చెప్పిన విశాల్.. తన సోదరుడు ఆర్య తండ్రి అయ్యాడని, సాయేషా పండంటి పాపకు జన్మనిచ్చిందని చెప్పాడు విశాల్. ఈ హీరో ప్రకటనతో సాయేషా మేటర్ బయటకొచ్చింది.
ఆర్య-సాయేషా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. “గజనీకాంత్” అనే సినిమాతో కలిసిన వీళ్లిద్దరూ అలా ప్రేమలో పడి, ఇలా పెళ్లి చేసుకున్నారు. 2019 మార్చిలో వీళ్లిద్దరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. అలా పెళ్లయిన రెండేళ్లకు బిడ్డకు జన్మనిచ్చింది సాయేషా. కరోనా వల్ల సాయేషా బయటకు రాలేదు. దీంతో ఆమె గర్భవతి అనే విషయం చాలామందికి తెలియదు.
రీసెంట్ గా ఆర్య నటించిన సార్పట్ట సినిమా ఓటీటీలో రిలీజై మంచి ఆదరణ దక్కించుకుంది. ఓవైపు ఆ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఆర్యకు ఇప్పుడు రెట్టింపు ఆనందాన్ని అందించింది సాయేషా. ప్రస్తుతం ఆర్య, విశాల్ కలిసి ఎనిమి అనే సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది.