సినిమాల్లో హీరోయిన్లు హీరోలకే దక్కుతారు! అవే సినిమాల్లో విలన్లు, చెడ్డవాళ్లు.. హీరోయిన్ కోసం ఎంత ట్రై చేసినా ప్రయోజనం ఉండదు. విలన్ల దగ్గర డబ్బు ఉంటుంది, కొందరు విలన్లు అందగాళ్లు కూడా! హీరోల కన్నా విలన్లే అందంగా ఉండే సినిమాలు కూడా వస్తుంటాయి. ఇలా అమ్మాయిలను సగటున ఆకట్టుకోవడానికి అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ.. విలనిజం ఫలితంగా వారు హీరోయిన్లను దక్కించుకోలేరు! ఇది సహజ సినీ సూత్రం! తమకు ప్రపోజ్ చేసే విలన్లను అమితంగా ద్వేషిస్తూ ఉంటారు హీరోయిన్లు. ఇదంతా సినిమాల్లో!
అయితే వాస్తవంలో మాత్రం.. వరసగా కుంభకోణాల వార్తల్లో నిలుస్తున్న వారితో హీరోయిన్ల సాన్నిహిత్యం ఆసక్తిదాయకంగా మారుతోంది. ఈజీ మనీని సంపాదించి, కేసులను ఎదుర్కొంటున్న వారితో హీరోయిన్ల సాన్నిహిత్యం చర్చనీయాంశంగా మారిందిప్పుడు. ఐపీఎల్ స్కామ్ తర్వాత ఇప్పటి వరకూ ఇండియాలో అడుగుపెట్టలేకపోతున్న లలిత్ మోడీతో ఒకప్పటి స్టార్ హీరోయిన్, నటీమణి సుస్మితా సేన్ డేటింగ్ చేస్తోందనే విషయం సర్వత్రా ఆసక్తిని రేపింది. దశాబ్దాల కిందట అంతర్జాతీయ అందాల పోటీల్లో దేశ పతాకాన్ని ఎగరేసిన సుస్మిత ఆ తర్వాతి కాలంలో తనలో నటనాపటిమ ఉందని కూడా నిరూపించుకుంది. పలు బాలీవుడ్ సినిమాలతో మొదలుపెడితే.. ఎన్నో కమర్షియల్ సినిమాల్లో నటించి తన ఉనికిని చాటుకుంది ఈ బెంగాళీ. ఇన్నే సుస్మిత అవివాహిత గానే మిగిలింది.
అయితే సుస్మిత వేరే వాళ్లతో ఎఫైర్ వార్తలతోనూ, రిలేషన్ షిప్ ఊహాగానాలతోనూ సుస్మిత పేరు చాలా సార్లే వినిపించింది. తన సహనటులతో ఆమెకు అనుబంధం ఉందని, సహజీవనం చేస్తోందనే టాక్ కూడా వినిపించింది. అదంతా ఆమె వ్యక్తిగతం. అలాగే సుస్మిత అనాథ పిల్లలను దత్తత తీసుకున్నట్టుగా కూడా ఉంది. ఇలా పెళ్లి కాకుండానే తల్లైంది. ఈ క్రమంలో అనేక బ్రేకప్ ల తర్వాత సుస్మిత లలిత్ మోడీతో బంధంలో ఉందనే వార్తలు వచ్చాయి. ఇవి స్వయంగా లలిత్ మోడీ వెల్లడించిన అంశాలే. ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉత్సాహాన్ని కూడా లలిత్ వెల్లడించాడు. ఇతడికి గతంలో పెళ్లైంది. తన కన్నా వయసులో పెద్దదైన ఒక మహిళను లలిత్ పెళ్లి చేసుకున్నాడు. ఆమె మరణించింది. ఈ క్రమంలో లేటువయసులో ఈయన మరో బంధాన్ని మొదలుపెట్టే ప్రయత్నంలో ఉన్నట్టున్నాడు.
కుంభకోణం చేశాడనే అభియోగాలు ఎదుర్కొంటూ స్వదేశంలో అడుగుపెట్టలేక విదేశంలో తలదాచుకున్న లలిత్ మోడీ ఇలా ఒక మాజీ ప్రపంచ సుందరిని ఆకట్టుకున్నాడంటే చిన్న విషయం ఏమీ కాదు!
విశేషం ఏమిటంటే.. ఇలాంటి విషయంలో లలిత్ మోడీ మొదటివాడు కాదు. తమిళనాడుకు చెందిన కాన్ మాన్ సుఖేష్ చంద్రశేఖరన్ కూడా హీరోయిన్లను వార్తల్లోకి తెచ్చాడు. నాలుగు వందల కోట్ల రూపాయల కుంభకోణంలో సుఖేష్ ను సూత్రధారిగా చెబుతూ.. ఈడీ పరిశోధన కొనసాగుతూ ఉంది. ఆ డబ్బును సుఖేష్ ఏం చేశాడంటే.. కొంతమంది హీరోయిన్ల కోసం ఖర్చు పెట్టినట్టుగా ఈడీ తేల్చింది. ఇప్పటికే ఈ వ్యవహరంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈడీ చుట్టూ తిరుగుతూ ఉంది. ఒక దశలో ఆమె పాస్ పోర్టును కూడా ఈడీ స్వాధీనం చేసుకుందనే వార్తలు వచ్చాయి. సుఖేష్ చంద్రశేఖరన్ నుంచి ఆమె ఎంత మేర లబ్ధి పొందింతే అంత మేర ఆమె ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసులో మరో హీరోయిన్ కూడా ఈడీ విచారణను ఎదుర్కొంటోంది.
అయితే కుంభకోణాల సూత్రధారులతో, రియల్ విలన్లతో హీరోయిన్ల సాన్నిహిత్యం ఈనాటిది అయితే కాదు. గతంలో డాన్లతో కూడా హీరోయిన్లకు సంబంధాలున్నాయనే వార్తలు వచ్చాయి. అందుకు ఆధారంగా ఫొటోలు లభించాయి. కొందరైతే డాన్లతో పాటు ఇబ్బందులు పడ్డారు కూడా! ముంబై బాంబు పేలుళ్లకు ముందు దావూద్ ఇబ్రహీంతో, బాలీవుడ్ స్టార్ మందాకిని సాన్నిహిత్యంగా మెలిగారు. ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే.. వారిద్దరూ జంటగా ఉన్న ఫొటోలు కూడా కనిపిస్తాయి. తన అందంతో వెండితెరను వేడెక్కించిన మందాకిని అలా ముంబై మాఫియా డాన్ కు సన్నిహితురాలనిపించుకుంది. అయితే ముంబై వరస పేలుళ్ల తర్వాత వీరి బంధానికి పెద్దగా ఆధారాలు లేనట్టున్నాయి. ఆ తర్వాత మందాకిని మరొకరిని పెళ్లి చేసుకుని సెటిలైంది.
అలాగే మరో డాన్ అబుసలేంతో మోనీకా బేడీ బంధం కూడా చర్చలో నిలిచింది. ఈ వ్యవహారం నడిపిన మోనిక ఆతర్వాతి కాలంలో జైలు పాలైంది కూడా!
సొసైటీలో ఆర్థిక నేరాలో, మరో తరహా నేరాలో చేసి.. వారికి సినిమాలు అంటే క్రేజ్ తోనో, దాని ద్వారా వచ్చి హీరోయిన్లపై క్రేజ్ తోనే వారు వీరిపై వల వేయడం పెద్ద విషయం కాదు. ఈ వలల్లో పడి.. వివాదాల పాలైన వారు కొందరైతే, అసలు బయటకు రాని వ్యవహారాలు కూడా ఎన్నో ఉండవచ్చు.
Kotha bandhalu kotha trend
Kotha trend sarikotha bandhalu
There are also cricketers who did match fixing before and after marrying heroines.
ఇది అనాదిగా ఉన్నదే.. జీవరాశి మనుగడకి ప్రకృతి ఆడజాతిలో మలిచిన ప్రవర్తన.. అందుకే పూర్వం బలపరీక్ష పెట్టేవారు స్వయంవరం లో భాగంగా.. అంటే ఆలిని ఏలుకునే సత్తా ఉన్నవాడే భర్త అని…
Ratiasanam chudali 3.00 ki
దానం మూలం ఇదం జగత్
ఎంత మోసం చేసిన, కోర్టులో కాలయాపనే తప్ప, కఠిన చర్యలు తీసుకునే HC జడ్జీలు లేరు.మోజు తీర్చుకోవడంలో జడ్జీలు తక్కువేమీ కాదు.పట్టుబడ్డ నకిలీ దళిత మహిళాఉద్యోగులకు వూరికే స్టే ఆదేశాలు ఇవ్వరు.మహిళలు జీతం కోసం రాజి -22yrs డబ్బు, బంగారం కోసం జడ్జీలను, ఎవరినన్నా వలలో వేసుకోగలరు. దిగజారుడు మొత్తం కుటుంబసభ్యులకు తెలుసు.నిజాలుకోసం వారిని కలిసే చొరవ ఎవ్వరికి ఉండదు. అటువంటి ఆలోచనే రాకుండా మత్తు మెదడుకు ముళ్ళ కంచె పెడుతుంది. కేవలం పొలిసు,న్యాయవాది చెప్పిన ప్రకటనలపై ఆధారపడటం మూర్ఖత్వం. హైదరాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషద్ లో ఇదే దౌర్భాగ్యం- FIR96/2016
మొత్తంకుటుంబసభ్యులకు 420,468 నిజాలు తెలుసు. కానీ నిజాలుకోసం వారిని కలిసే చొరవ ఎవ్వరికి ఉండదు. న్యాయవాది వాగుడు, పొలిసు కట్టుకథలు అటువంటి ఆలోచనే రాకుండా మెదడుకు మత్తు ఎక్కిస్తారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పే పురోగతి పైనే ఆధారపడే బానిసత్వం వచ్చేస్తుంది. ముళ్ళ కంచె కిరీటం పెడుతుంది. లలిత్ మోడీ దగ్గరకు కేవలం సుస్మిత సేన్ వెళ్లిందని మీకు కనబడితే,మాకు న్యాయవాది హారీస్ సాల్వే వానితో కలిసి మందు కొట్టే కార్యక్రమం చూసాం. న్యాయవాదులె వారికి వెన్నుముక అని తెలియాలి కదా.పొలిసు, న్యాయవాది చెప్పిన ప్రకటనలపై ఆధారపడటం మూర్ఖత్వం.శిక్షనుండి తప్పించడంలో వారే సూత్రధారులు, పాత్రధారులు.