గోపీచంద్-సంపత్ నంది కాంబినేషన్ లో తయారైన సినిమా సీటీమార్. ఈ సినిమాకు విడుదల అన్నది పెద్ద సమస్యగా మారింది. ఏప్రిల్ 2న విడుదల చేద్దామని గట్టిగా అనుకున్నారు. కానీ సినిమాను నైజాం కు కొన్న వరంగల్ శ్రీను అడ్డం తిరిగాడు.
వకీల్ సాబ్ విడుదల వన్ వీక్ లోవుండగా ఇది రిలీజ్ సరికాదని, అలా చేస్తే, తాను మూడు కోట్లు మించి నైజాం కు కట్టలేనని చేతులు ఎత్తేసాడు. రెండు కోట్లకు పైగా తేడా వస్తుండడంతో నిర్మాత వెనకడుగు వేయక తప్పలేదు.
ఇప్పుడు మరో డేట్ అనేసరికి మళ్లీ అదే సమస్య వస్తోంది. ఏప్రిల్ 29 లేదా 30 న విడుదల చేద్దాం అనుకుంటే ఆ రోజు ఇప్పటికే ఫిక్స్ అయిన విరాటపర్వం సినిమా బయ్యర్ కూడా ఈ వరంగల్ శ్రీనునే. వైజాగ్, నైజాం లకు కొన్నారు.
తన సినిమా మీదే తన సినిమా వేయడానికి ఎంత వరకు కోపరేట్ చేస్తాడు అన్నది చూడాలి. పోనీ అలా అని మే ఫస్ట్ వీక్ లోకి వెళ్దాం అనుకుంటే వారం గ్యాప్ లో ఆచార్య విడుదల వుంది.మళ్లీ ఏప్రిల్ 2 లాంటి సమస్యే.
ఇలా మొత్తం మీద అంతా రెడీ అయిపోయి, సెన్సారు అయిపోయినా కూడా సీటీమార్ కు సీటీ ఊదడం కష్టంగా వుంది.