సీనియర్‌ నటి గీతాంజలి కన్నుమూత

సీనియర్‌ నటి గీతాంజలి కన్నుమూశారు. బుధవారం ఆమెకు గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెకు రాత్రి 11.45 గంటలకు మరోసారి  నిమిషాలకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. Advertisement…

సీనియర్‌ నటి గీతాంజలి కన్నుమూశారు. బుధవారం ఆమెకు గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెకు రాత్రి 11.45 గంటలకు మరోసారి  నిమిషాలకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.

తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లోనూ నటించారు. సహనటుడు రామకృష్ణను వివాహం చేసుకున్న గీతాంజలి అసలు పేరు మణి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన గీతాంజలి 1961లో సీతారామ కళ్యాణం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఆమె సీత పాత్రలో నటించి మెప్పించారు. 

కాలం మారింది, శారద, డాక్టర్‌ చక్రవర్తి, పూలరంగడు, మురళీకృష్ణ, అవేకళ్లు, సంబరాల రాంబాబు, కలవారి కోడలు, గుఢచారి 116, దేవత వంటి హిట్‌ సినిమాల్లో నటించి మంచిపేరు సాధించారు.

మునిగిపోయిన టిడిపి ఇప్పట్లో పైకి తేలడం కష్టమే