Advertisement

Advertisement


Home > Movies - Movie News

సెంటిమెంట్ కత్తి మీద కామెడీ సాము

సెంటిమెంట్ కత్తి మీద కామెడీ సాము

దర్శకుడు మారుతి ఇప్పటి వరకు చాలా లైట్ సబ్జెక్ట్ లే తీసుకుని సినిమాలు చేస్తూ వచ్చారు. జానర్ ఏదైనా, సులువుగా నవ్వులు పండించేసే కళ మారుతికి వచ్చు. ప్రేమకథాచిత్రమ్, భలేభలే మగాడివోయ్, మహానుభావుడు ఇలాంటి సినిమాలే. అయితే తొలిసారిగా కాస్త టిపికల్ సబ్జెక్ట్ ను టేకప్ చేసారు.

మారిపోతున్న, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మెటీరియలిస్టిక్ గా మారిపోతున్న మానవ సంబంధాల నేపథ్యంలో, అత్యంత సున్నితమైన మరణం అనే దాన్ని ఫన్ తో డీల్ చేయడం అన్నది మారుతి తీసుకున్న సబ్జెక్ట్. 

ప్రతిరోజూ పండగే అనే టైటిల్ తో తయారైన ఈ సినిమా ట్రయిలర్ బయటకు వచ్చింది. క్యాన్సర్ ముదిరిపోయి, వారంలో చనిపోయే పెద్దాయిన. పూర్తిగా మెటీరియలిస్టిక్ గా మారిపోయిన కొడుకులు. తాత కోసం వచ్చిన మనవడు ఏం చేసాడు? తాతను ఎలా హ్యాపీగా వుంచాడు అన్నది లైన్ గా ట్రయిలర్ లో కనిపిస్తోంది. 

ట్రయిలర్ కట్ విషయంలో మారుతి పాస్ అయిపోయారు. అందులో ఎంత మాత్రం సందేహం లేదు. నీ రెండు నిమషాల ట్రయిలర్ లో వున్న విషయాన్ని రెండు గంటల కథగా ఎలా చెప్పారు?అది కూడా ఓ మనిషి మరణం ముందు రోజులను పండగలా సెలబ్రేట్ చేసుకోవడం అన్నదాన్ని ఎలా కన్విన్సింగ్ కా చెప్పగలిగారు? కొడుకుల వైఖరి ప్రేక్షకుడికి సూటిగా గుచ్చుకోకుండా ఎలా డీల్ చేయగలిగారు? అన్నది అంతా ఆసక్తికరం.

వాస్తవం చెప్పాలంటే మారుతి టాలెంట్ కు ఈ సినిమా పరీక్షే. ఇది పాస్ అయిపోతే, మారుతి ఇక రకరకాల ప్రయోగాలు హ్యాపీగా చేసేసుకోవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?