నెల రోజులు.. ఒక పెద్ద సినిమా, 2 మంచి చిత్రాలు

సెప్టెంబర్ మాసంలో దాదాపు 18 సినిమాలు రిలీజ్ అవ్వగా.. మత్తు వదలరా 2 హిట్టయింది. 35-చిన్న కథ కాదు, సత్యం సుందరం సినిమాలు ప్రేక్షకుల మనసుల్ని తాకాయి

సెప్టెంబర్ బాక్సాఫీస్ కాస్త విభిన్నంగా సాగింది. భారీ సినిమా వచ్చింది, మీడియం రేంజ్, స్మాల్ మూవీస్ కూడా వచ్చాయి. బాక్సాఫీస్ రిజల్ట్ సంగతి పక్కనపెడితే.. 2 చిన్న సినిమాలపై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో ఆసక్తికర చర్చ సాగడం అభినందించదగ్గ విషయం.

సెప్టెంబర్ మొదటి వారంలో పెద్ద సినిమాలేం లేవు. విజయ్ నటించిన గోట్ సినిమా తమిళ జనాలకు పెద్దది, మనకు కాదు. అంచనాల్లేకుండా వచ్చిన ఆ సినిమా ఎలాంటి ఆసక్తిని రగిలించలేదు సరికదా, చిరాకు మిగిల్చింది. అయితే ఇదే వారం వచ్చిన “35-చిన్న కథ కాదు” అనే సినిమా బాగా ఆకట్టుకుంది, ఎంతోమందిని ఆలోచింపజేసింది.

భావోద్వేగాలతో కూడిన ఓ మంచి కథకు, మనసుకు హత్తుకునే కథనం తోడైంది. దానికి నివేత థామస్ లాంటి నటి యాడ్ అయింది. ఫలితంగా ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. నేపథ్య సంగీతం, నందకిషోర్ దర్శకత్వం అదనపు బలాలుగా నిలిచాయి.

అలా ఓ హార్ట్ టచింగ్ మూవీతో మొదలైన సెప్టెంబర్ బాక్సాఫీస్, రెండో వారంలో ప్రేక్షకులకు వినోదాన్నిచ్చింది. మత్తు వదలరా 2 సినిమా థియేటర్లలో నవ్వులు పంచింది. సత్య కామెడీతో ఈ సినిమా గట్టెక్కింది. అంచనాలు పెట్టుకోకుండా, లాజిక్స్ పట్టించుకోకుండా చూసిన ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేశారు.

ఇదే వారంలో వచ్చిన భలే ఉన్నాడే, ఉత్సవం, ఏఆర్ఎమ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. భలే ఉన్నాడే సినిమాపై రాజ్ తరుణ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు కానీ ఫలితం లేకపోయింది. ఇక టొవినో నటించిన ఏఆర్ఎమ్, ఏళ్లుగా నలుగుతూ ఎట్టకేలకు రిలీజైన ఉత్సవం ఫెయిలయ్యాయి.

మూడో వారంలో.. అరడజను సినిమాలొచ్చినా చెప్పుకోదగ్గ చిత్రం ఒక్కటీ లేదు. సుహాస్ నటించిన గొర్రె పురాణం ఇందులో ఒకటి. ప్రచార లోపం ఈ సినిమా కొంప ముంచింది. ఇక రీ-రిలీజ్ గా వచ్చిన బొమ్మరిల్లు సినిమా హంగామా 3-4 స్క్రీన్స్ కే పరిమితమైంది.

చివరి వారంలో అందరూ ఎంతగానో ఎదురుచూసిన దేవర-1 సినిమా వచ్చింది. అర్థరాత్రి నుంచే షోలు మొదలయ్యాయి. మిక్స్ డ్ టాక్ కూడా అర్థరాత్రి నుంచే మొదలైంది. ఎన్టీఆర్ స్టార్ పవర్ తో మొదటి వారంతం మంచి వసూళ్లు వచ్చినప్పటికీ.. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు సినిమా లేదు. మరీ ముఖ్యంగా క్లయిమాక్స్ పై పెదవి విరుపులు ఎక్కువయ్యాయి.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగులుతుందా లేక బ్రేక్-ఈవెన్ అవుతుందా అనే విషయం తేలాలంటే మరికొన్ని రోజులాగాలి. పెద్ద సినిమాల వసూళ్లపై ప్రతిసారి నడిచే చర్చ, దేవర-1పై కూడా కొనసాగుతోంది.

దేవరతో పాటు అదే వారంలో సత్యంసుందరం అనే సినిమా వచ్చింది. కార్తి, అరవింద్ స్వామి నటించిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుంది. అయితే థియేటర్లలో కలెక్షన్లు మాత్రం లేవు. దేవరతో పోటీ పడకుండా సోలోగా రిలీజైనట్టయితే, ఈ సినిమా ఫలితం మరోలా ఉండేది.

ఇలా సెప్టెంబర్ మాసంలో దాదాపు 18 సినిమాలు రిలీజ్ అవ్వగా.. మత్తు వదలరా 2 హిట్టయింది. 35-చిన్న కథ కాదు, సత్యం సుందరం సినిమాలు ప్రేక్షకుల మనసుల్ని తాకాయి. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలనే సరికొత్త చర్చకు తెరతీసింది. దేవర-1 సినిమా రిజల్ట్ పెండింగ్ లో ఉంది.

12 Replies to “నెల రోజులు.. ఒక పెద్ద సినిమా, 2 మంచి చిత్రాలు”

  1. చూడగా చూడగా తెలిసొచ్చేదేంటంటే, తమరికి పెద్ద సినిమాలు నచ్చవు.

    ఎంతసేపూ, చిన్న సినిమాలు మంచి సినిమాలు అంటూ కాలక్షేపం చేస్తావు..

    దేవర విషయంలో కూడా ఇది తెలుస్తోంది.. మిక్స్డ్ టాక్ అని ఏదో వడుతున్నావ్ గానీ, అంత సీరియస్ కథను మూడు గంటలు ఎలా ఎంగేజింగ్ గా నడిపించారో గమనించట్లేదు.. సినిమాలో తమరికి మరీ అంత బాగోలేని విషయం ఏముందో అర్థం కావట్లేదు ..

    దయచేసి పెద్ద సినిమాలను కూడా ప్రోత్సహించండి.. థియేటర్లలో ఎప్పటికైనా అసలైన పండగ పెద్ద సినిమాలదే ..

    నువ్వు చెప్పే ఆ క్లైమాక్స్ మొదటిసారి అంతగా ఎక్కదు, కానీ రెండవ సారికి ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది..

  2. Boker nakodaka అన్నం thintinnava పెంట thintunnava-

    నువు ఈ ఆర్టికల్రా సే టైమ్ ki 91% రికవరీ అయింది అంటే cost failure అని రాసి వచ్చిన డబ్బులతో కడుపు nimpukovatamu

    Pakkalesi మీ వాళ్ళని వచ్చిన డబ్బులు tho కడుపు ninpukovatam సమానం

Comments are closed.