ఇటీవల రోడ్డు ప్రమాదంలో తెలుగు బిగ్‌బాస్ ఫేమ్, సినీ క్రిటిక్ కత్తి మహేశ్ ప్రాణాలు కోల్పవడాన్ని మరిచిపోకనే, మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బిగ్‌బాస్ ఫేమ్, నటి యాషికా ఆనంద్ తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆమె మృత్యువుతో పోరాడుతున్నట్టు సమాచారం.
చెంగల్‌పట్టు జిల్లా మామల్లపురంలో డివైడర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బిగ్‌బాస్ ఫేమ్ యాషికా ఆనంద్ సహా మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. అలాగే యాషికా స్నేహితురాలు, హైదరాబాద్‌కు చెందిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ వల్లిశెట్టి (28) భవాని అక్కడికక్కడే మృతి చెందారు. మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
తీవ్రంగా గాయపడిన యాషికా ఆనంద్‌తో పాము మరో ఇద్దరిని చికిత్స కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యాషిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
యాషికా తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. పలు రియాల్టీ షోల్లో కూడా పాల్గొని గుర్తింపు పొందారు. స్వస్థలం ఢిల్లీ అయినప్పటికీ, చెన్నైలో సెటిల్ అయ్యారు. బిగ్‌బాస్ 3 తమిళ్ సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చి కోలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యారు.