ఇదిగో పరుశురామ్ అంటే అదిగో సెటిల్ మెంట్ అనేసారు. ఇంకేం లేదు..చెక్ కూడా ఇచ్చేసాడు అన్నట్లు వార్తలు వండేసారు. కానీ విషయం ఏమిటంటే, సెటిల్ మెంట్ అన్న తరువాత ఇచ్చిన లెక్కల మీద ఇప్పటి వరకు పరశురామ్ నుంచి సమాధానం లేదన్నది అసలు విషయం. 14రీల్స్ తో ఇక కిందా మీదా పడడం ఎందుకు, సెటిల్ మెంట్ చేసుకుంటే పోలా అని మిత్రులు, దిల్ రాజు లాంటి వాళ్లు సలహా ఇచ్చారో ఏమో, ఆ విధంగా వ్యవహారం ముందుకు కదిలింది.
14రీల్స్ అధినేతలు కూడా సరే అనుకుని, ఇచ్చిన అడ్వాన్స్, దానికైనా వడ్డీ, పరశురామ్ సినిమా కోసం హీరో చైతన్యకు ఇచ్చిన అడ్వాన్స్ కు అయిన వడ్డీ, ఇతరత్రా ఖర్చులు అన్నీ కలిపి 14 నుంచి 16 మధ్యలో ఎక్కడో ఓ లెక్క తేల్చారు. ఆ లెక్కను పరశురామ్ కో, ఈ ప్రతిపాదన తెచ్చిన మీడియేటర్లకో అందించారు.
సరే, లెక్కలు అన్నీ చూసి మళ్లీ టచ్ లోకి వస్తామని అప్పుడు వెళ్లిన వారు ఇప్పటి వరకు మరో మాట లేదు..మనుషుల జాడ లేదు అని తెలుస్తోంది. చూస్తూ..చూస్తూ అన్ని కోట్లు వెనక్కు ఇవ్వాలంటే ఎవరైనా అంత సులువుగా చేయి రాదు. పైగా ఇచ్చినది వెనక్కు ఇవ్వడం అంటే కొంత వరకు ఓకె. వడ్డీలు గట్రా ఇవ్వాలంటే కాస్త బాధగానే వుంటుంది.
అసలు విషయం అది కాదు, సెటిల్ మెంట్..సెటిల్ మెంట్ అంటూ 14రీల్స్ జనాలను అలా నడిపిస్తూ, విజయ్ దేవరకొండ సినిమాకు అడ్డం పడకుండా చూస్తున్నారు. ఇదో తరహా గేమ్ అని మరి కొందరు అంటున్నారు.
మొత్తం మీద ఈ ఉదంతమే ఓ సినిమా కథ లెవెల్ లో తయారవుతోంది. మరోపక్కన పరశురామ్ తాను 16 కోట్లు ఇచ్చి సెటిల్ చేసుకున్నానని సన్నిహితులతో చెబుతున్నట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. అంతా సినీ మాయ.