అనుష్క శెట్టి..నవీన్ పోలిశెట్టి ఇద్దరూ కీలకం మిస్ శెట్టి అండ్ మిసెస్ పోలిశెట్టి సినిమాలో. కానీ ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ చూస్తే మాత్రం అంతా నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షో అన్నట్లు వుంది.
నవీన్ పోలిశెట్టికి సహజంగా వుండే ఈజ్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీతో టీజర్ మొత్తంలో డామినేట్ చేసేసాడు.అనుష్క జస్ట్ సీన్ ఇగ్నీషన్ గానో, స్టార్టర్ గానో ఉపయోగపడింది తప్ప, అంతకు మించి అయితే కాదు.
హోటల్ చీఫ్ చెఫ్ గా అనుష్క, స్టాండప్ కమెడియన్ గా నవీన్ పోలిశెట్టి కనిపించారు. ననీన్ దగ్గర వున్న అడ్వాంటేజ్ ఏమిటంటే సీన్ కు తగినట్లు తానే డైలాగులు అల్లేసుకుంటాడు. అవి పక్కా అతనికి, అతని బాడీ లాంగ్వేజ్ కు, మాడ్యులేషన్ కు సెట్ అయిపోతాయి. దాంతో సీన్ పండి, జనం ఫక్కున నవ్వే స్టేజ్ కు వస్తుంది.
‘నీ టైమింగ్ ఎప్పుడూ ఇంతేనా’ అంటే…’ కామెడీ టైమింగ్ మాత్రం పెర్ ఫెక్ట్’ అనడం, స్టాండప్ కమెడియన్ అని చెప్పబోతే…స్టాండప్ అనే లోగానే..స్టాండప్ ఫర్ ఉమెన్ రైట్స్ అని ఆగకుండా అండ్ నేషనల్ యాంథమ్ అని అనడం పక్కా నవీన్ స్టయిల్.
యువి నిర్మాణం కాబట్టి విజువల్స్, ఖర్చు బాగా కనిపించాయి. టోటల్ గా సినిమా మీద అంచనాలు పెంచేలా వుంది టీజర్.