అట్లీ దర్శకత్వంలో షారూక్ చేస్తున్న సినిమా జవాన్. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్, ఫస్ట్ లుక్ రిలీజైంది. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఆ ఆనందం షారూక్ కు ఎక్కువ కాలం నిలవలేదు. ఈ స్టార్ హీరో కరోనా బారిన పడ్డాడు. వెంటనే ఐసొలేషన్ లోకి వెళ్లాడు. దీంతో అతడు చేయాల్సిన జవాన్ సినిమా షూటింగ్ నిలిచిపోయింది.
ఈమధ్య కరణ్ జోహార్ బర్త్ డే పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి హాజరైన వారిలో చాలామందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో పాటు అటు మహారాష్ట్రలో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో బాలీవుడ్ మరోసారి కరోనా బారిన పడింది.
ఇప్పటికే కత్రినాకైఫ్, ఆదిత్య రాయ్ కపూర్, కార్తీక్ ఆర్యన్ లాంటి ప్రముఖులు తాము కరోనా బారిన పడినట్టు వెల్లడించారు. ఇప్పుడీ లిస్ట్ లోకి షారూక్ చేరాడు. వీళ్లందరికంటే ముందే నటుడు అక్షయ్ కుమార్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
షారూక్ కు ఎక్కడ కరోనా ఎఫెక్ట్ అయి ఉంటుందనే అంశంపై స్పష్టత లేదు. ఎందుకంటే, ఈమధ్య ఎవ్వరూ మాస్క్ ధరించడం లేదు. అటు షారూక్ భార్య, గౌరీఖాన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే అంశంపై కూడా ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు రాలేదు.
షారూక్ కరోనా బారిన పడ్డంతో ఆయన నటించాల్సిన జవాన్ సినిమా షూటింగ్ వాయిదా పడింది. తిరిగి 3 వారాల తర్వాత ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఈమధ్య కాలంలో దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోసారి మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం.