డ‌బ్బు కోస‌మే ఆమె న‌టి అవ‌తార‌మెత్తారు

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ష‌కీలా సినిమాల‌కు ప్ర‌త్యేక క్రేజ్ ఉంది. ష‌కీలా సినిమాల‌కు ప్ర‌త్యేక ప్రేక్ష‌కులున్నారు. ఒక‌ప్పుడు ష‌కీలా సినిమాల విడుద‌లను దృష్టిలో పెట్టుకుని పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ డేట్లు ప్లాన్ చేసుకునేవాళ్లు.  Advertisement ఇండ‌స్ట్రీలో…

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ష‌కీలా సినిమాల‌కు ప్ర‌త్యేక క్రేజ్ ఉంది. ష‌కీలా సినిమాల‌కు ప్ర‌త్యేక ప్రేక్ష‌కులున్నారు. ఒక‌ప్పుడు ష‌కీలా సినిమాల విడుద‌లను దృష్టిలో పెట్టుకుని పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ డేట్లు ప్లాన్ చేసుకునేవాళ్లు. 

ఇండ‌స్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మ‌ల‌యాళి న‌టి ష‌కీలా జీవితం ఆధారంగా ఇంద్ర‌జిత్ లంకేశ్ ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్‌లో  ‘షకీలా’ తెర‌కెక్కింది. ఈ సినిమాలో రిచాచ‌ద్దా టైటిల్ రోల్ పోషించారు. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ఈ సినిమా విడుద‌లైంది. 

ఈ సంద‌ర్భంగా న‌టి రిచా చ‌ద్దా ష‌కీలా గురించి మాట్లాడారు. సినిమాల్లో న‌టించాల‌ని, స్టార్ కావాల‌ని ష‌కీలా ఎప్పుడూ కోరుకోలేద‌న్నారు. కేవ‌లం డ‌బ్బు కోసం మాత్ర‌మే ఆమె సినిమాల్లో న‌టించార‌ని రిచా చెప్పుకొచ్చారు.

ష‌కీలా త‌ల్లి ఓ జూనియ‌ర్ ఆర్టిస్ట్ అని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా కుటుంబ స‌భ్యుల బ‌ల‌వంతంపై ష‌కీలా న‌టిగా మారార‌న్నారు. ఆర్థికంగా నిల‌దొక్కుకునేందుకు మాత్ర‌మే ష‌కీలా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టార‌న్నారు. తాను ష‌కీలా మాదిరిగా సినిమాలో క‌నిపించ‌డానికి  కొంచెం బరువు పెరగాల్సి వచ్చింద‌ని రిచా తెలిపారు.

మీ సీఎం సాబ్ కి ఈ వకీల్ సాబ్ వార్ణింగ్ ఇస్తున్నాడు