అఖిల్ ఎక్కడ?

బిగ్ బాస్ సీజన్ 4 సాగినన్నాళ్లు టాప్ లైన్ ఆర్టర్ లో వుంటూ వచ్చాడు అఖిల్. మోనాల్ తో నెరపిన లవ్ ట్రాక్ కావచ్చు, ప్రతి టాస్క్ లో గట్టిగా పోరాడడం వల్ల కావచ్చు. …

బిగ్ బాస్ సీజన్ 4 సాగినన్నాళ్లు టాప్ లైన్ ఆర్టర్ లో వుంటూ వచ్చాడు అఖిల్. మోనాల్ తో నెరపిన లవ్ ట్రాక్ కావచ్చు, ప్రతి టాస్క్ లో గట్టిగా పోరాడడం వల్ల కావచ్చు. 

అందరికన్నా ముందుగా టాప్ ఫైవ్ లోకి చేరడం వల్ల కావచ్చు అఖిల్ మీద అందరి దృష్టి పడింది. చివరి వరకు గట్టి పోటీ ఇచ్చాడు. అఖిల్ నా? అభిజిత్ నా? విన్నర్ అనే పరిస్థితి వరకు వచ్చి, రన్నర్ గా మిగిలాడు.

సాధారణంగా విన్నర్ తో పాటు రన్నర్ కు కూడా కాస్త పబ్లిసిటీ,హడావుడి వుంటుంది. కానీ ఈసారి చిత్రంగా రన్నర్ అప్ వుండగానే అతనికి కాకుండా మరొకరికి ప్రచారం వచ్చేసింది. అఖిల్ కు రావాల్సిన క్రెడిట్ అంతా సోహెల్ కొట్టుకుని వెళ్లిపోయాడు.

ఇదిలావుంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వారంతా చేసే హడావుడి ఇంతా అంతా కాదు. ఊరేగింపులు, ఇంటర్వ్యూలు, ప్రచారాలు ఒకటేమిటి? బోలెడు. 

టాప్ ఫైవ్ లో అభిజిత్, సోహైల్, అరియానా ఈ హడావుడిలో భాగం అయ్యారు. హారిక మాత్రం పెద్దగా హడావుడి చేయలేదు. ఇక రన్నర్ అప్ అయిన అఖిల్ జాడే తెలియలేదు. విన్నర్ అభిజిత్ తెగ హడావుడి చేస్తుంటే, రన్నర్ అఖిల్ మాత్రం గాయబ్ అయిపోయాడు. 

చూస్తుంటే బిగ్ బాస్ అతన్ని బాగా డిస్సపాయింట్ చేసినట్లు కనిపిస్తోంది. అందుకే ఇంటికే పరిమితమై వుండిపోయినట్లున్నాడు.

మీ సీఎం సాబ్ కి ఈ వకీల్ సాబ్ వార్ణింగ్ ఇస్తున్నాడు