నా భర్త ఏం చేసేవాడో నాకు తెలీదు: శిల్పాషెట్టి

మాజీ హీరోయిన్, బాలీవుడ్ బ్యూటీ శిల్పాషెట్టి బాంబ్ పేల్చింది. పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయి, ప్రస్తుతం జైలులో ఉన్న తన భర్త రాజ్ కుంద్రా, గతంలో ఏం చేసేవాడో తనకు తెలియదని ప్రకటించింది. తను నిత్యం…

మాజీ హీరోయిన్, బాలీవుడ్ బ్యూటీ శిల్పాషెట్టి బాంబ్ పేల్చింది. పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయి, ప్రస్తుతం జైలులో ఉన్న తన భర్త రాజ్ కుంద్రా, గతంలో ఏం చేసేవాడో తనకు తెలియదని ప్రకటించింది. తను నిత్యం షూటింగ్స్ తో బిజీగా ఉండేదాన్నని, రాజ్ కుంద్రా ఆ టైమ్ లో ఏం చేసేవాడో తనకు అస్సలు ఐడియా లేదని శిల్పాషెట్టి చెప్పుకొచ్చింది. స్వయంగా పోలీసులు నమోదుచేసిన ఛార్జ్ షీట్ లో శిల్పాషెట్టి ఈ విషయం చెప్పింది.

“నేను గతంలో చాలా బిజీగా ఉండేదాన్ని, రాజ్ కుంద్రా ఏం చేసేవాడో నాకు తెలీదు. కుంద్రాకు లింక్ పెట్టి చెబుతున్న హాట్ షాట్స్, బాలీ ఫేమ్ లాంటి యాప్స్ గురించి నాకు అస్సలు తెలీదు.”

కుంద్రాపై దాఖలు చేసిన 1400 పేజీల చార్జ్ షీట్ లో శిల్పా షెట్టి ఇలా రెస్పాండ్ అయింది. అయితే ఇదే విషయాన్ని మీడియా ముందు రిపీట్ చేయడానికి ఆమె నిరాకరించింది. శిల్పాషెట్టి సమాధానంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. భర్త ఏం చేస్తున్నాడో తెలియకుండానే ఇన్నేళ్లు కాపురం చేశావా అంటూ ఆమెపై ట్రోలింగ్ నడుస్తోంది.

మరోవైపు పోర్నో వీడియోస్ కోసం ముంబయి శివార్లలో ఉన్న వియాన్ ఇండస్ట్రీస్ పరిసర ప్రాంతాల్ని రాజ్ కుంద్రా ఉపయోగించుకున్నట్టు చార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్నారు.

జులై 19 నుంచి రాజ్ కుంద్రా జైలులోనే ఉంటున్నాడు. అతడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ఇప్పటికే 2 సార్లు రిజెక్ట్ అయింది. తాజాగా మరోసారి బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నాడు కుంద్రా. అదింకా పెండింగ్ లో ఉంది. తను కేవలం ఎరోటిక్ కంటెంట్ మాత్రమే తీశానని, పోర్న్ కంటెంట్ (సెక్స్ వీడియోలు) తీయలేదని తన బెయిల్ పిటిషన్ లో వాదిస్తున్నాడు కుంద్రా.

మరోవైపు కుంద్రాకు చెందినవని భావిస్తున్న పోర్నోగ్రఫీ యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి తొలిగించినప్పటికీ.. అందులో కంటెంట్ కొత్తకొత్త పేర్లతో, కొత్త యాప్స్ లో ప్లే స్టోర్ లో కనిపిస్తూనే ఉంది. తాజాగా వెలుగులోకొచ్చిన బాలీ ఫేమ్ అనే యాప్ ఈ కోవకు చెందినదే.