కొన్ని వివాదాలు వెన్నాడినా.. ఇప్పుడు మళ్లీ నవ్వుతూ కనిపిస్తూ ఉంది బాలీవుడ్ నటి శిల్పా షెట్టి. పోర్న్ వ్యవహారంలో కొన్ని నెలల పాటు జైల్లో ఉండి వచ్చిన భర్త రాజ్ కుంద్రాతో ఇప్పుడు శిల్ప మళ్లీ జంటగా కనిపిస్తూ ఉంది. ఈ జంట మీడియాకు ఇప్పుడు పోజులు ధైర్యంగా ఇస్తోంది. కుంద్రా పోర్న్ వ్యవహారంలో చిక్కుకున్నప్పుడు శిల్పా షెట్టి మార్కెట్ దెబ్బతిన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి.
ఆ సంగతలా ఉంటే.. తన తాజా చాట్ షో లో శిల్పా షెట్టి తన అతిధితో ఒక తరహా సెక్స్ చాట్ చేసింది. ఆ అతిధి బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య తహిరా కశ్యప్. స్వతహాగా రచయిత అయిన తహిరా సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడింది.
నీ దృష్టిలో బెస్ట్ వర్కవుట్ ఏది? అని శిల్ప అడగగా.. సెక్స అంటూ సమాధానం ఇచ్చింది ఆయుష్మాన్ భార్య. శృంగారానికి మించిన వ్యాయామం ఏముందని ప్రశ్నించింది. శృంగారం వల్ల బోలెడన్ని క్యాలరీలు ఖర్చవుతాయని, వేగంగా క్యాలరీలు ఖర్చయ్యే వ్యాయామంలో శృంగారానిదే ముందు స్థానం అంటూ ఆమె విశ్లేషించింది.
తహిరా బోల్డ్ నెస్ ను, ఆమె ఓపెన్ గా విశదీకరించడాన్ని శిల్పా షెట్టి అభినందించింది. బాలీవుడ్ సెలబ్రిటీల చాట్ షోల్లో సెక్స్ ప్రస్తావన లేకుండా ఉండటం దాదాపు అరుదు. కాఫీ విత్ కరణ్ లో అయినా, నో ఫిల్టర్ విత్ నేహా లో అయినా ఈ ప్రశ్నలు తప్పవు. శిల్పా షెట్టి నిర్మొహమాటంగా ఇదే పంథాను అనుసరిస్తోంది.