మరో కొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతోంది అనగా, టాలీవుడ్ లో ఓ వార్త విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. టాలీవుడ్ లో అత్యంత భారీ సినిమాగా తయారైన మల్టీ స్టారర్, రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' వాయిదా పడిందన్నదే ఆ వార్త. ఇది ఎంత వరకు నిజం అన్నది క్లారిటీ ఇంకా అఫీషియల్ గా అయితే రాలేదు. కానీ పరిస్థితులు మాత్రం అలాగే కనిపిస్తున్నాయి.
అమెరికాలో ఒకే రోజు మూడున్నర లక్షల కేసులు రావడం, మహరాష్ట్రలో కర్ఫ్యూ విధించడం, తమిళనాడు లో యాభై శాతం ఆక్యుపెన్సీ అమలులోకి రావడం, ఇప్పటికే ఢిల్లీలో ఆంక్షలు అమలులో వుండడం ఇలాంటి కారణాలు అన్నీ కలిసి ఆర్ఆర్ఆర్ ను వాయిదా దిశగా నడిపిస్తున్నాయనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
కానీ ఇప్పుడు వాయిదా వేయడం అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పటి వరకు సాగించిన ప్రచారం మళ్లీ చేయాలి అంటే కనీసం పది నుంచి ఇరవై కోట్లు ఖర్చు వుంటుంది. అలాగే ఓవర్ సీస్ లో థియేటర్ పెనాల్టీలు కట్టాల్సి వుంటుంది. ఇవన్నీ ఆలోచించే ఆంధ్ర, సీడెడ్ బయ్యర్లకు 40శాతం డిస్కౌంట్ ఇచ్చి మరీ విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు తమిళనాడు బయ్యర్ కూడా ఇదే మాదిరిగా యాభై శాతం డిస్కౌంట్ అడుగుతున్నారనే వార్తలు కూడా వినిపించాయి.
ఇప్పుడు ఇవన్నీ కలిసి మరి ఆర్ఆర్ఆర్ ను సమ్మర్ దిశగా నడిపిస్తున్నాయని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే పరిస్థితులు ఇలాగే వుంటే సంక్రాంతికి రావాల్సిన రాధేశ్యామ్ కూడా వాయిదా పడక తప్పదని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.