షూటింగ్ కు సిద్దమవుతున్న సూపర్ స్టార్

తండ్రి మరణంతో విషాదంలో మునిగిపోయిన హీరో మహేష్ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. నలుగురితో వుంటే కాస్త నవ్వు మొహంతో వుంటున్నారని, ఒంటరిగా వుంటే మళ్లీ మూడ్ ఆఫ్ అవుతున్నారని బోగట్టా.  Advertisement ఇలాంటి నేపథ్యంలో ఇంట్లో…

తండ్రి మరణంతో విషాదంలో మునిగిపోయిన హీరో మహేష్ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. నలుగురితో వుంటే కాస్త నవ్వు మొహంతో వుంటున్నారని, ఒంటరిగా వుంటే మళ్లీ మూడ్ ఆఫ్ అవుతున్నారని బోగట్టా. 

ఇలాంటి నేపథ్యంలో ఇంట్లో వుండిపోయే బదులు షూటింగ్ కు వెళ్తేనే బెటర్ అనే సలహాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో డిసెంబర్ తొలి వారాంతం నుంచి షూటింగ్ కు వెళ్లే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది. 

త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని చినబాబు నిర్మించే సినిమా ను ప్రారంభించాల్సి వుంది. వాస్తవానికి ఈ సినిమా కోసం ఓ చిన్న ఫైట్ షెడ్యూలు చేసి ఆపేసారు. కథ మీద చర్చలు సాగించిన తరువాత కొత్త కథతో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు.

అందువల్ల ఇప్పుడు కొత్తగా ప్రారంభిస్తున్నట్లే లెక్క. ఈ సినిమా కోసం సీనియర్ హీరోయిన్ శోభన ను కీలకపాత్రకు తీసుకునే ఆలోచనలు సాగుతున్నాయి. మిగిలిన‌ స్టార్ కాస్ట్, టెక్నికల్ కాస్ట్ అంతా సేమ్. 

గతంలో పృధ్వీరాజ్ ను తీసుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు అవసరం లేదు. థమన్ సంగీత దర్శకుడిగా వుంటారా? వుండరా? అన్న అనుమానాలు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు ఆ విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది. అందువల్ల షూటింగ్ కు అంతా సిద్దం అన్నమాట.