Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఔను, స‌ర్జ‌రీ చేయించుకున్నా.. శ్రుతిహాస‌న్

ఔను, స‌ర్జ‌రీ చేయించుకున్నా.. శ్రుతిహాస‌న్

న‌టి, క‌మ‌ల్ హాస‌న్ త‌న‌య శ్రుతి హాస‌న్ ను ట్రోల్ చేసే వాళ్లు త‌ర‌చూ ఆమె చేయించుకున్న స‌ర్జ‌రీల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ మ‌ధ్య టెన్ ఇయ‌ర్స్ చాలెంజ్ టైమ్ లో అయితే శ్రుతిని మ‌రీ టార్గెట్ చేశారు నెటిజ‌న్లు. ప‌దేళ్ల కింద‌టి శ్రుతి హాస‌న్ ఫొటోను పెట్టి, ఇటీవ‌లి ఆమె ఫొటోతో కంపారిజ‌న్ చేస్తూ ట్రోల్ చేశారు. కెరీర్ ఆరంభంలోనే శ్రుతి హాస‌న్ త‌న ఫేస్ స‌ర్జ‌రీకి వెళ్లింది. స‌ర్జ‌రీ తో చాలా అందంగా త‌యారు అయ్యింది. స‌ర్జ‌రీ తో వ‌చ్చిన మార్పుల‌తో పాటు, వ‌య‌సుతో వ‌చ్చిన మార్పులు శ్రుతిని అందంగా తీర్చిదిద్దాయి. సాధార‌ణంగా కొంత‌మంది టీనేజ్ లో అంత అందంగా అగుపించ‌రు. ట్వంటీస్ లోనే చాలా మంది అందంగా మార‌తారు. శ్రుతి అలా మారింది. స్టార్ హీరోయిన్ అయ్యింది. 

అయితే క్ర‌మంగా శ్రుతి హాస‌న్ పాత మొహాన్ని చాలా మంది మ‌రిచిపోయారు. అయితే జ‌నాలు ఊరికే ఉండే టైపు కాదు క‌దా, గుచ్చి గుచ్చి అవ‌త‌ల వాళ్ల‌ను ఇబ్బంది పెట్ట‌డం చాలా మందికి ఒక హాబీ. అలానే అవ‌కాశం దొరికిన‌ప్పుడల్లా శ్రుతి హాస‌న్ ను అలా విమ‌ర్శిస్తూ ఉంటారు. సోష‌ల్ మీడియా వ‌చ్చాకా ఇదంతా చాలా ఎక్కువైంది. శ్రుతి అంద‌మైన పిక్ ను పోస్టు చేసిన‌ప్పుడ‌ల్లా కొంత‌మంది ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ క్ర‌మంలో త‌న స‌ర్జ‌రీ విష‌యంలో ఈ హీరోయిన్ స్పందించింది.

త‌ను ఫేస్ స‌ర్జ‌రీ చేయించుకున్న మాట వాస్త‌వ‌మే అని, అది దాచేదేమీ కాద‌ని శ్రుతి పోస్టు పెట్టింది. అయితే అంద‌రూ అలా చేయించుకోవాల‌ని త‌ను చెప్ప‌డం లేద‌ని, త‌న‌కు ఇష్టం అయ్యింది కాబ‌ట్టి త‌ను స‌ర్జ‌రీ చేయించుకున్న‌ట్టుగా శ్రుతి హాస‌న్ పేర్కొంది. ఫేస్ స‌ర్జ‌రీల‌ను త‌ను ప్ర‌మోట్ చేయ‌డం లేద‌ని, త‌న‌కు ఇష్ట‌మై త‌ను చేయించున్న‌ట్టుగా తేల్చి చెప్పింది. త‌న‌ను ట్రోల్ చేసే వారికి కూడా శ్రుతి ఇలా ధీటుగా స‌మాధానం ఇచ్చేసింది.

పోలవరం ప్రాజెక్ట్ స్పీడ్ పెంచిన వైఎస్ జగన్

దేన్నీ ఎవరూ ఆపలేరు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?