Advertisement

Advertisement


Home > Politics - Andhra

బ్రదర్ అనిల్ మాటల మర్మం.. షర్మిల ఓటమే!

బ్రదర్ అనిల్ మాటల మర్మం.. షర్మిల ఓటమే!

భార్య ఎన్నికల్లో పోటీ చేస్తోంది. వీర బీభత్సంగా పర్యటనలు సాగిస్తూ.. ప్రత్యర్థుల మీద మాటల నిప్పులు చెరుగుతూ చెలరేగిపోతోంది. భర్త మాత్రం ఎన్నికల ప్రచారం జోలికి వెళ్లకుండా కేవలం ఇంటిపట్టున కూర్చుని ఉన్నారు. సాధారణంగా ఇలాంటి పోకడలను మనం గమనించగలమా? కానీ వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ మాత్రం ప్రచారంలో లేరు.

ప్రచారం చేయడం లేదు గానీ మంచిచెడుల ప్రవచనాలు చెబుతున్నారు. కానీ ఆయన మాటలను గమనిస్తే.. కడప ఎంపి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షర్మిల ఓటమి తథ్యం అని, ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్ గెలవడం కూడా తథ్యమని అర్థమవుతోంది.

ఎందుకంటే- ‘దేవుడు ఎవరికి అన్యాయం చేయడు.. కొందరు డబ్బు కోసం పదవి కోసం అమ్ముడుపోతారు. అన్యాయం చేసిన వారికి శిక్ష తప్పదు. ఇక్కడ మేనేజ్ చేసుకున్నా.. అక్కడ దేవుడి సన్నిధిలో శిక్ష తప్పదు’ అంటూ ఆయన సువార్తను వినిపిస్తున్నారు.

డబ్బు కోసం కొందరు అమ్ముడుపోతారు- అనడం వెనుక ఆయన ఉద్దేశం వీరు పెడుతున్న ప్రలోభాలకు కడప నియోజకవర్గ పరిధిలోని నాయకులు లొంగడం లేదని, షర్మిల వైపు మళ్లడం లేదని, అందుకే వారంతా డబ్బుకు అమ్ముడుపోయినట్లుగా చెబుతున్నారనేది ప్రజల భావనగా ఉంది.

అలాగే, ‘ఇక్కడ మేనేజ్ చేసుకున్నా.. అక్కడ దేవుడి సన్నిధిలో శిక్ష తప్పదు’ అనే మాటల అర్థం- ప్రస్తుతానికి ఇక్కడ ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గెలవబోతున్నాడు అని మాత్రమే అని కూడా ప్రజలకు అనిపిస్తోంది.

బ్రదర్ అనిల్ మాటల్లో.. అంతిమ విజయం న్యాయానికే దక్కుతుందట.. అంటే అది ఎప్పుడని ఆయన ఉద్దేశమో చెప్పలేదు. అంతిమ విజయం ఈ ఎన్నికల్లోనే తేలుతుందా? లేదా చచ్చిపోయిన తర్వాత దేవుడి సన్నిధిలో దక్కేదే అంతిమ విజయమా ఆయన క్లారిటీ ఇస్తే బాగుండేది.

‘నేనెప్పుడూ ఒక వ్యక్తికి ఓటు వేయాలని దేవుడిని కోరను’ అని బ్రదర్ అనిల్ అంటున్నారు. దేవుడు కూడా ఓటు వేస్తాడా? అనేది ప్రజల సందేహం. భార్య షర్మిల ఓటమి గురించి ముందుగా అర్థమైపోయింది గనుకనే.. కురిసే వర్షాన్ని ఆగిపొమ్మని దేవుడిని శాసించే ఈ మతప్రచారకుడు అనిల్.. నేను ఎవ్వరినీ గెలిపించాలని దేవుడిని అడగడను అంటూ.. ముందే పలాయనమంత్రం పఠిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?