గ్రౌండ్ లెవెల్ లోకి వైసీపీ!

వైసీపీ ఈసారి అద్భుత విజయం సాధిస్తుంది అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గతంలో వచ్చిన సీట్ల కంటే ఒకటి రెండు సీట్లు అదనంగా గెలుస్తామని కూడా ధీమాగా చెబుతున్నారు. అయితే గ్రౌండ్ రియాలిటీ…

వైసీపీ ఈసారి అద్భుత విజయం సాధిస్తుంది అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గతంలో వచ్చిన సీట్ల కంటే ఒకటి రెండు సీట్లు అదనంగా గెలుస్తామని కూడా ధీమాగా చెబుతున్నారు. అయితే గ్రౌండ్ రియాలిటీ అన్నది ఒకటి ఉంటుంది కదా. అక్కడ పరిణామాలు ఏమిటి అన్నది కూడా చూసుకోవాలి.

పోలింగ్ జరిగిన ఒకటి రెండు రోజుల పాటు ఒక రకమైన వేడి వాతావరణం ఉంటుంది. ఆ వూపు ఒక పాలపొంగు లాంటిది. అది తగ్గాక అసలు పాలు ఎంత అన్నది తెలుస్తుంది. ఫలితాలకు ఇంకా సమయం ఉండడంతో ఉత్తరాంధ్రలో వైసీపీ పరిస్థితి ఏమిటి అన్నది గ్రౌండ్ లెవెల్ దాకా వెళ్ళి వైసీపీ ఒకటి రెండు సార్లు తరచి చూసుకుంటోంది.

తమకు వచ్చిన అంచనాలు కరెక్టా లేదా ఎక్కడైనా అతి ఉందా అన్నది కూడా చెక్ చేసుకుంటోంది. ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఆరా తీస్తున్నారు. విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో ఆయన భేటీ అయి క్షేత్ర స్థాయిలో పరిణామాలు పోలింగ్ సరళి మీద పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తున్నారు.

వైసీపీకి ఈసారి విశాఖలో సీట్లు కొత్తగా జత కలుస్తాయని అయితే విశాఖ రూరల్ లో కొన్ని సీట్లు కోల్పోతారని ఒక జనరల్ ఒపీనియన్ ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరంలో తమ గ్రాఫ్ ఎంతవరకూ నిలబడింది టఫ్ సీట్లలో పరిస్థితి ఏమిటి అనకాపల్లి విశాఖ ఎంపీ సీటులో పరిస్థితి ఏమిటి అన్న దానిని వైవీ సుబ్బారెడ్డి నేతల నుంచి సమాచారాన్ని సేకరించారు అని  తెలుస్తోంది. మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉత్తరాంధ్రాలో ఉన్నాయి. ఇందులో మెజారిటీ సీట్లు వైసీపీ గెలుస్తుంది అని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.