సినిమాల్ని తిరస్కరించే విషయంలో ఒక్కో హీరోయిన్ ఒక్కో పద్ధతి ఫాలో అవుతుంది. ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా, తను ఇబ్బంది పడకుండా ఓ చిన్న సాకు చెప్పి తప్పించుకుంటారు. తాజాగా శృతిహాసన్ కూడా అదే పనిచేసింది. బాలకృష్ణ సినిమా ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించింది. ఈ క్రమంలో ఆమె వాడుకున్న పేరు ''ప్రభాస్''.
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా వస్తోంది. మలినేని సినిమా అంటే అందులో శృతి ఉండాల్సిందే. ఎందుకంటే, ఈ దర్శకుడికి శృతి అంటే సెంటిమెంట్. అదే సెంటిమెంట్ తో వెళ్లి శృతిహాసన్ కు కథ చెప్పాడు. అంతా బాగానే ఉంది కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలయ్య లాంటి సీనియర్ తో కలిసి సినిమా చేయలేనని చెప్పేసింది శృతిహాసన్.
ఓవైపు ప్రభాస్ లాంటి యంగ్ హీరోతో సలార్ సినిమాలో నటిస్తోంది శృతిహాసన్. ఇలాంటి టైమ్ లో బాలయ్య లాంటి సీనియర్ హీరో సరసన నటించలేనని చెప్పేసింది. అయితే గోపీచంద్ మలినేని సెంటిమెంట్ ను గౌరవిస్తూ, ఆ సినిమాలో ఓ చిన్న ప్రత్యేక పాత్రలో కనిపించడానికి అంగీకరించిందట.
ఇలా ప్రభాస్ పేరు చెప్పి బాలకృష్ణ సినిమాను రిజెస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. నిజానికి బాలయ్య సినిమాలకు స్టార్ హీరోయిన్లు దొరకడం చాలా కష్టం. బాగా డబ్బులిస్తే నయనతార లాంటి హీరోయిన్లు చేస్తారేమో కానీ, ఇతర స్టార్ హీరోయిన్లంతా బాలయ్య సినిమాల్లో నటించడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు.