Advertisement

Advertisement


Home > Movies - Movie News

గుడిలో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరోహీరోయిన్లు

గుడిలో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరోహీరోయిన్లు

నిన్నంతా హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హాట్ టాపిక్ గా మారారు. వీళ్లిద్దరూ వనపర్తిలోని గుడిలో పెళ్లి చేసుకున్నారనే వార్త వైరల్ అయింది. అయితే ఈ విషయాన్ని ఇటు సిద్ధూ, అటు అదితి ఇద్దరూ నిర్థారించలేదు. తాపీగా ఈరోజు ఇద్దరూ సోషల్ మీడియాలోకి వచ్చారు.

అంతా అనుకుంటున్నట్టు వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోలేదంట. కేవలం నిశ్చితార్థం మాత్రమే చేసుకున్నారట. ఈ విషయాన్ని సిద్ధార్థ్-అదితి ఇద్దరూ బయటపెట్టారు. తమ వేళ్లకు ఉన్న ఎంగేజ్ మెంజ్ రింగ్స్ చూపిస్తూ ఫొటో దిగి, దాన్ని షేర్ చేశారు.

షూటింగ్ అంటూ అబద్ధం..?

నిజానికి వనపర్తి లాంటి చిన్న టౌన్ లో ఏం జరిగినా అది వెంటనే బయటకొస్తుంది. అయితే ఈ విషయంలో సిద్దార్థ్-అదితి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగా షూటింగ్ అంటూ కలరింగ్ ఇచ్చారట. రంగనాధ స్వామి ఆలయంలో సెట్ కూడా వేశారంట.

షూటింగ్ కాబట్టి ఆలయంలో పూజారులు అవసరం లేదని సమాచారం ఇచ్చారు. సరిగ్గా ఇక్కడే ఎవ్వరికీ అనుమానం రాలేదు. కానీ సిద్దార్థ్ చెన్నై నుంచి అర్చకుల్ని రప్పించాడట. వాళ్ల సమక్షంలో ఇద్దరూ పరస్పరం రింగులు మార్చుకున్నారు.

తమిళ సంప్రదాయంలో జరగడం వల్ల దూరం నుంచి చూసినవాళ్లు దాన్ని పెళ్లి అనుకున్నారు. కానీ తమకు నిశ్చితార్థం మాత్రమే జరిగిందని ఈ జంట ఈరోజు ప్రకటించింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?