ఒకేసారి రెండు సంప్రదాయాల్లో పెళ్లిళ్లు చేసుకున్న జంటల్ని చూశాం. సాధారణంగా హిందు-క్రిస్టియన్, హిందు-ముస్లిం, క్రిస్టియన్-ముస్లిం సంప్రదాయాల్లో ఈ పెళ్లిళ్లు ఒకేరోజు జరుగుతుంటాయి. కానీ సిద్దార్థ్, అదితి రావు మాత్రం రెండు వేర్వేరు సంప్రదాయాల్లో, రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు.
సెప్టెంబర్ లో వీళ్ల పెళ్లి జరిగింది. ఆ ఫొటోల్ని కూడా వీళ్లు షేర్ చేశారు. ఇప్పుడీ జంట మరోసారి పెళ్లి చేసుకుంది. రాజస్థాన్ లోని బిషన్ గఢ్ కోటలో వీళ్లు మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఈ ఫొటోల్ని కూడా వీళ్లు షేర్ చేసుకున్నారు.
సెప్టెంబర్ లో చేసుకున్న పెళ్లిలో అదితి-సిద్దార్థ్ సింపుల్ గా కనిపించారు. దక్షిణ భారతదేశ శైలిలో సింపుల్ శారీలో అదితి కనిపించగా, అంతే సింపుల్ గా లుంగీ, షర్ట్ ధరించి సిద్దార్థ్ కనిపించారు.
సెప్టెంబర్ లో వనపర్తిలోని 400 ఏళ్ల నాటి గుడిలో పెళ్లి చేసుకున్న ఈ జంట, ఈసారి రాజస్థాన్ లోని 230 ఏళ్ల నాటి కోటలో పెళ్లి చేసుకుంది.
రాజస్థాన్ లో చేసుకున్న పెళ్లిలో మాత్రం వీళ్లు రాజుల సంప్రదాయంలో భారీ వస్త్రాలు, నగలు ధరించి రాయల్ గా పెళ్లి చేసుకున్నారు. డిజైనర్ సవ్యశాచి ముఖర్జీ వీళ్ల దుస్తుల్ని రాచరికం ఉట్టిపడేలా డిజైన్ చేశాడు.
తాము మరోసారి పెళ్లి చేసుకున్నామనే విషయాన్ని ఈ జంట నేరుగా చెప్పలేదు. కేవలం ఫొటోలు మాత్రమే షేర్ చేసింది. అలా అని ఇది ఫొటో షూట్ కాదు. ఎందుకంటే, ఇందులో అదితి మెడలో సిద్దార్థ్ తాళి కడుతున్న ఫొటో కూడా ఉంది మరి. వీళ్లిద్దరూ ఇలా మరోసారి ఎందుకు పెళ్లి చేసుకున్నారనేది చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.
వాళ్ళ పైసలు, వాళ్ళ ఫ్యాన్సీస్
Call boy jobs available 7797531004
Call boy works 7797531004
All the best
repeated marriage with different persons& in different situations is common to aditi& siddarth in past, present& future also…🤣🤣🤣
Second marriage to both of them, I think that’s why..
వాళ్ళ ఇలవేల్పు కులదైవం వద్ద శాస్త్రోక్తంగా సంప్రదాయ బద్దంగా పెళ్లి చేసుకున్నారు.. ఇది సరదా కోసం…
జరగాలి మళ్ళీ మళ్ళీ
vc available 9380537747
ఇదేదో చెల్లికి కావాలి పెళ్లి మళ్లీ మళ్లీ .. టైపు యవ్వారం లాగుండే