నేను కూడా అదే ఫీలవుతున్నా – శ్రీలీల

కేవలం నటనకు ఆస్కారం ఉందనే కోణంలోనే ‘భగవంత్ కేసరి’ సినిమాలో కీలక పాత్ర పోషించడానికి అంగీకరించింది.

శ్రీలీల మంచి డాన్సర్. ఈమధ్య ఆమెకు డాన్సింగ్ క్వీన్ అనే బిరుదు కూడా ఇచ్చారు. మరి యాక్టింగ్ సంగతేంటి..? డాన్స్, ఆమె నటనను డామినేట్ చేస్తోందా? ఇదే ప్రశ్న శ్రీలలకు ఎదురైంది. దానికి ఆమె అవునంటూ సమాధానమిచ్చింది.

“నా డాన్స్, నా నటనను డామినేట్ చేస్తుందని నేను కూడా ఫీల్ అవుతున్నాను. ఎగ్జామ్స్ కోసం కొన్ని నెలలు గ్యాప్ తీసుకుంటున్నాను. ఆ గ్యాప్ లో స్క్రిప్ట్ పై కూడా కొంచెం నాలెడ్జ్ పెంచుకొని, మంచి రోల్స్ ఎంచుకోవాలనుకుంటున్నాను. నేను నటన నేర్చుకున్నదే డాన్స్ వల్ల. కాబట్టి డాన్స్ విషయంలో నేనెప్పుడూ గర్వంగానే ఫీలవుతా. ఇకపై యాక్టింగ్ పై కూడా ఫోకస్ పెడతా.”

కేవలం నటనకు ఆస్కారం ఉందనే కోణంలోనే ‘భగవంత్ కేసరి’ సినిమాలో కీలక పాత్ర పోషించడానికి అంగీకరించింది. అందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి కూడా. అయినప్పటికీ ఇంకా ఆమెను డాన్సింగ్ క్వీన్ గానే చూస్తున్నారు.

అందుకే ఇకపై నటనకు ఆస్కారమున్న మంచి పాత్రలు ఎంచుకుంటానని, అందులో డాన్స్ కూడా ఉండేలా చూసుకుంటానని అంటోంది శ్రీలీల. అంతేకాదు, త్వరలోనే తనను సింగర్ గా కూడా చూడొచ్చని హామీ ఇస్తోంది.

8 Replies to “నేను కూడా అదే ఫీలవుతున్నా – శ్రీలీల”

  1. ఏదో వాళ్లు అన్నారు, వీళ్ళు చెప్పారు, మీరు రాస్తారు కానీ, మన సినిమాల్లో హీరోయిన్ “యాక్ట్” చేసే రోల్స్ ఎక్కడ వస్తున్నాయి..ఉన్న వాలుగు సీన్లు లో హీరో మీద

    పడిపోయి, వీలైతే నాలుగు సాంగ్స్ లో డాన్స్ చెయ్యటం తప్ప..

Comments are closed.