అక్కడ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్

వైసీపీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి విశాఖ కార్పోరేషన్ ని గెలుచుకోవాలని టీడీపీ కూటమి చూస్తోంది

మహా విశాఖ నగర పాలక సంస్థలో మళ్లీ జంపింగులు మొదలయ్యాయి. ఇప్పటిదాకా పదమూడు మంది కార్పోరేటర్లను వైసీపీ నుంచి లాగేసిన టీడీపీ కూటమి లేటెస్ట్ గా మరో ఇద్దరిని తమ వైపునకు తిప్పుకుంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఇద్దరు వైసీపీ కార్పోరేటర్లు టీడీపీ గూటికి చేరారు. దీంతో వైసీపీ నుంచి జంపింగ్ చేసిన కార్పోరేటర్ల సంఖ్య పదిహేనుకు చేరుకుంది. టీడీపీలోకి పది మంది చేరితే జనసేనలోకి అయిదుగురు చేరారు.

జీవీఎంసీలో అరవై మంది వరకూ బలం ఉన్న వైసీపీ నంబర్ ఇపుడు 45కి పడిపోయింది. 98 మంది మంది కార్పోరేటర్లు ఉన్న జీవీఎంసీలో మేయర్ సీటు దక్కించుకోవాలంటే 49 మంది కార్పోరేటర్లు బలం అవసరం. అయితే ఎక్స్ అఫీషియో హోదాలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కార్పోరేషన్ లో ఉన్నారు

దాంతో వైసీపీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి విశాఖ కార్పోరేషన్ ని గెలుచుకోవాలని టీడీపీ కూటమి చూస్తోంది. టీడీపీలో విశాఖ మేయర్ సీటు కోసం చాలా మంది పోటీలో ఉన్నారు. విశాఖ కార్పోరేషన్ ని టీడీపీ ఒకే ఒకసారి 1987లో గెలుచుకుంది.

దాదాపు నలభై ఏళ్ళ తరువాత మేయర్ పీఠాన్ని అందుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. ఆ కల తొందరలో సాకారం అవుతుందని కూటమి నేతలు అంటున్నారు. వైసీపీ నేతలు మాత్రం తమ పార్టీ నుంచి వెళ్ళిన వారు అవకాశవాదులుగా చిత్రీకరిస్తున్నారు.

8 Replies to “అక్కడ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్”

  1. వచ్చే కార్పోరేషన్ ఎన్నికల్లో మా అన్నయ్య వై నాట్ 98 అంటూ ప్రచారం చేస్తాడు..

      1. మన కాంటాక్ట్స్ కూడా లాగేస్తారా ఎలాగా ? రికార్డ్ అయితే చేస్తారు తెల్సు

Comments are closed.