యాంటీ డ్రగ్ వీడియో చేయాల్సిందే!

ఇప్పుడు హీరో బన్నీ వంతు వచ్చింది. హైదరాబాద్ లో ఈవెంట్ చేయాల్సి వుంది పుష్ప 2 కోసం. దీనికి అనుమతి కోసం చూస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం పద్దతి బాగుంది. ఏ హీరో అయినా సరే, ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం కావాలంటే ప్రజలను చైతన్య పరిచేలా యాంటీ డ్రగ్స్ మీద ఓ వీడియో బైట్ ఇవ్వాల్సిందే. ఈ విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నట్లు వుంది ప్రభుత్వం. ఆ మధ్య దేవర విడుదల టైమ్ లో ఇదే జరిగింది. ముందుగా పెద్దగా రేట్లు రాలేదు. మరి కొంచెం అదనపు రేట్లు కావాలి అన్నపుడు విదేశాల్లో వున్న హీరో ఎన్టీఆర్ అప్పటికప్పుడు వీడియో చేసి ఇవ్వాల్సి వచ్చింది.

ఇప్పుడు హీరో బన్నీ వంతు వచ్చింది. హైదరాబాద్ లో ఈవెంట్ చేయాల్సి వుంది పుష్ప 2 కోసం. దీనికి అనుమతి కోసం చూస్తున్నారు. ఇది కావాలంటే ముందుగా బన్నీ వైపు నుంచి కూడా యాంటీ డ్రగ్స్ వీడియో బైట్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు బన్నీ తన స్టయిల్ లో దీన్ని చేసి అందించాల్సి వుంది. బహుశా ఇవ్వాళో, రేపో బన్నీకి ఫ్రీ టైమ్ దొరికినపుడు అది చేసే అవకాశం వుంది.

హైదరాబాద్ లో ఈవెంట్ ఎలాగైనా చేయాలన్నది పుష్ప 2 ఈవెంట్ ప్రయత్నం. అందుకోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియో బైట్ అవసరం పడింది. అదీ విషయం.

8 Replies to “యాంటీ డ్రగ్ వీడియో చేయాల్సిందే!”

  1. మంచి సాంప్రదాయమే..

    పాలస్ కి పిలిపించుకుని వాళ్లతో దండాలు పెట్టించుకుని, తండ్రి లాంటి వారు అని చెప్పించుకోవటం కన్నా చాలా మంచి సాంప్రదాయం.…

    .

    స్వకార్యం..స్వామికార్యం

Comments are closed.