Advertisement

Advertisement


Home > Movies - Movie News

సిద్దు రిస్క్ చేయడం లేదు

సిద్దు రిస్క్ చేయడం లేదు

డిజె టిల్లు అంటూ చిన్న సినిమాగా వచ్చి, మోత మోగించి ఓ లెవెల్ కు చేరిపోయాడు సిద్దు జొన్నలగడ్డ. ఆ వెంటనే మరో సినిమా ఏదీ చేయకుండా టిల్లు సీక్వెల్ మీదే వుండిపోయాడు. 

ఇటీవలే ముహుర్తం కూడా చేసుకున్నారు. అయితే ఈ సీక్వెల్ విషయంలో అస్సలు రిస్క్ చేయడం లేదట. మళ్లీ మరోసారి అచ్చంగా డిజె టిల్లు లాంటి సినిమానే చూపించబోతున్నాడట.

అదెలా అంటే ఫార్ట్ వన్ లో ఏం జరిగింది. టిల్లు ఓ అమ్మాయిని బాగా నమ్మేసి బకరా అయిపోయాడు. రెండో భాగంలో కూడా అంతేనట. మరోసారి మరో అమ్మాయిని నమ్మేసి బకరా అవుతాడన్నమాట. టిల్లు ఆటిట్యూడ్, డైలాగులు అన్నీ సేమ్ టు సేమ్ వుంటాయి. అమ్మాయి మారుతుంది. బకరా అయ్యే విధానం మారుతుందన్నమాట. 

టిల్లు ఆటిట్యూడ్, డైలాగులు, మాడ్యులేషన్ వీటన్నింటి మీద విపరీతమైన క్రేజ్ వుంది. అందువల్ల ఆ 'బండి బాట'లోనే సులువుగా వెళ్తూ, సేఫ్ బెట్ చేయాలనుకుంటున్నాడేమో సిద్దూ. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?