పదేళ్లపాటు ఇండస్ట్రీలో వున్నా కూడా సరైన గుర్తింపు రాలేదు సిద్దు జొన్నలగడ్డ కు. అలాంటిది కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాతో ఓవర్ నైట్ గుర్తింపు వచ్చేసింది.
మాంచి యూత్ ఫుల్ రొమాంటిక్ స్టార్ అనిపించేసుకున్నాడు. ఆ తరువాత నరుడి బతుకు నటన అనే సినిమా చేస్తున్నాడు. విమల్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు పని చేస్తున్నాడు.
ఈ సినిమాలో హాట్ హాట్ రొమాంటిక్ సీన్లలో సిద్దు కనిపిస్తాడని తెలుస్తోంది. కొన్ని సీన్లు రొమాన్స్ ను దాటి హాట్ టచ్ ను అందుకుంటాయని, అర్జున్ రెడ్డి ని గుర్తు చేస్తాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తో సిద్దు రొమాంటిక్ హీరోగా ఫిక్స్ అయిపోతాడని టాక్.
హీరోయిన్ ను ఫ్లర్ట్ చేసే సీన్లు, ఆమెతో ఇంటిమసీ సీన్లు ఓ రేంజ్ లో చిత్రీకరించాడట కొత్త దర్శకుడు విమల్. రష్ చూసిన వారు అంతా ఈ యూత్ ఫుల్ జోనర్ కు సిద్దూ ఐకాన్ అయిపోతాడని అంటున్నారు మరి. సినిమా విడుదలయితే అసలు విషయం తెలుస్తుంది.