cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

సింగరేణి నేపథ్యంలో నాని సినిమా

సింగరేణి నేపథ్యంలో నాని సినిమా

హీరో నాని మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. నిజానికి ఇది ఏనాడో ఒకె చేసిన సినిమా. 

ప్రస్తుతం శర్వానంద్ తో ఆడాళ్లూ మీకు జోహార్లు, రామారావు ఆన్ డ్యూటీ, విరాటపర్వం సినిమాలను నిర్మిస్తున్న సుధాకర్ చెరుకూరి ఈ కొత్త సినిమాకు నిర్మాత. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఈ సినిమాకు పని చేస్తారు.

టక్ జగదీష్ కన్నా ముందే నాని ఒప్పుకున్న సినిమా ఇది. అయితే అటు నిర్మాత ఇటు హీరో ఇద్దరూ బిజీగా కావడంతో ఇప్పటికి అనౌన్స్ మెంట్ వస్తోంది. 

ప్రస్తుతం నాని చేస్తున్న శ్యామ్ సింఘ రాయ్, అంటే సుందరానికి సినిమాలు పూర్తి కావస్తున్నాయి. వాటి తరువాత ఈ సినిమా ప్రారంభమవుతుంది. 

పూర్తిగా సింగరేణి గనుల బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ అని తెలుస్తోంది. ఈ కథ నచ్చడంతో కొత్త దర్శకుడికి నాని అవకాశం ఇచ్చారు. 

చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

 


×