బిగ్‌బాస్ రియాల్టీ షో సీజన్ -5 బ్యూటీ సిరి హనుమంతు మొదటిసారిగా తన ప్రియుడు శ్రీహాన్‌తో సంబంధాలపై నోరు విప్పారు. ప్రస్తుతం నడుస్తున్న రియాల్టీ షోలో సిరి హనుమంతు కాబోయే జీవిత భాగస్వామి శ్రీహాన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల శ్రీహాన్ కోసం సిరి హౌస్‌కు వెళ్లి వచ్చారు. ఈ నేపథ్యంలో మరో బిగ్‌బాగ్ కంటెస్టెంట్ అరియానాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరి తన పర్సనల్ లైఫ్‌లో చోటు చేసుకున్న వివాదాల గురించి వెల్లడించారు.
ఇంటర్వ్యూలో భాగంగా సోషల్ మీడియాలో సిరి గురించి వైరల్ అయిన పోస్టులను అరియానా చూపారు. ఈ సందర్భంగా సిరికి శ్రీహాన్ బ్రేకప్ చెప్పాడని, తన లైఫ్ నుంచి సిరి జ్ఞాపకాలను అతను తీసేసాడనే పోస్టుపై స్పందించాలని అరియానా కోరారు. మొదట ఆ పోస్ట్ చూడగానే… అబ్బే ఇదెప్పుడు జరిగిందని సిరి నంగనాచి కబుర్లు చెప్పారు. ఆ తర్వాత తాను బిగ్‌బాస్ సీజన్-5లో వున్నప్పుడు జరిగి వుంటుందని సమాధానం చెప్పారు.
జ్ఞాపకాలను తీసేసి వుంటే… తాము ఇప్పుడు ఇలా కలిసి వుండేవాళ్లమా? అని సిరి ప్రశ్నించడం గమనార్హం. అసలు మీ మధ్య గొడవలు అవుతాయా? అని అరియానా ప్రశ్నించారు. గొడవలు అవుతాయా…అని ఆశ్చర్యాన్ని అభినయించారు. తాను ఇంత వరకూ ఎక్కడా ఎవరికీ చెప్పలేదంటూ శ్రీహాన్‌తో తన సంబంధాలపై వివరించారు.
బిగ్‌బాస్ సీజన్-5 ముగిసిన తర్వాత… తమ వ్యక్తిగత జీవితాల్లో చాలా సమస్యలు వచ్చాయన్నారు. చాలా అంటే చాలా అయ్యాయని నొక్కి చెప్పారు. వాటి గురించి చెబితే… ఇలా జరిగిందా? అని మీరు ఊహించలేరని సిరి తెలిపారు. ఫర్వాలేదు… ఒకట్రెండు చెప్పాలని అరియానా ఉడికించారు. బ్రేకప్ వరకూ వెళ్లినట్టు సిరి అంగీకరించారు. తను ఒక్కడే ట్రిప్‌నకు వెళ్లాడని చెప్పింది ఆమె. ఆ సమయంలో తనకు కోవిడ్ సోకినట్టు సిరి వివరించారు. తనకు కూడా ఏదో ఒకటి చేసేసుకుందామనే ఆలోచన వచ్చిందన్నారు.
జనాలకు, ఇంట్లో వాళ్లకు ఎవరికీ కనిపించకుండా ఎక్కడైనా వెళ్లిపోదామని అనుకున్నట్టు సిరి పేర్కొన్నారు. ఉదయాన్నే ఆరు గంటలకు నిద్రలేచి మణికొండ రోడ్డుపై చెప్పుల్లేకుండా తిరిగానని, ఇలా చాలా జరిగిందిలే అని నిరాశతో చెప్పుకొచ్చారామె. మళ్లీ శ్రీహాన్ వచ్చి ఇంటికి తీసుకెళ్లాడన్నారు. ఇప్పుడు తమ మధ్య బలమైన బంధం వుందన్నారు. ఎంతలా అంటే ఇకపై ఎప్పటికీ విడిపోమన్నంతగా బంధం బలపడినట్టు సిరి చెప్పుకొచ్చారు.
బిగ్‌బాస్ రియాల్టీ షోలో సిరి, యూట్యూబ్ ఫేమ్ షణ్ముక్ మధ్య సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే షణ్ముక్‌కు ప్రియురాలైన దీప్తి సునయను దూరం చేసేంతగా … బిగ్‌బాస్ హౌస్‌లో సిరి అతనికి దగ్గరైంది. వాటిని దృష్టిలో పెట్టుకునే సిరి తాజాగా శ్రీహాన్‌తో విడిపోయేంత వరకూ వెళ్లిందని చెప్పడం.